365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై,అక్టోబర్ 15,2024: ఇసుజు మోటార్స్ ఇండియా AIS-125 టైప్ C ఆంబులెన్స్ నిర్దేశనలతో పూర్తిగా నిర్మించిన ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ప్రారంభాన్ని ప్రకటించింది. ఈ మార్గదర్శకమైన ఆంబులెన్స్ అత్యవసర వైద్య సంరక్షణ సేవలలో కొత్త ప్రామాణికాన్ని ఏర్పరచడమే కాకుండా, రోగుల రవాణాలో అసమానమైన విశ్వసనీయత, భద్రత,సౌకర్యాన్ని అందిస్తుంది.
ఇసుజు నిరూపిత సాంకేతికతను ఆధారంగా తీసుకొని, భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్, దేశంలో ‘బేసిక్ లైఫ్ సపోర్ట్’ ఆంబులెన్సులలో కొత్త యుగాన్ని ప్రారంభిస్తుంది. 14 ‘బెస్ట్-ఇన్-క్లాస్’ లక్షణాలతో వస్తున్న ఈ ఆంబులెన్స్ అత్యవసర సేవలలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రారంభం గురించి వ్యాఖ్యానిస్తూ, తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా అన్నారు, “14 ‘బెస్ట్-ఇన్-క్లాస్’ లక్షణాలతో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ప్రవేశపెట్టడం పట్ల మేమెంతో సంతోషిస్తున్నాము. ఇసుజు ఎల్లప్పుడూ నమ్మకమైన ,విశ్వసనీయమైన పేరుగా నిలుస్తుంది. ఈ ఆంబులెన్స్ భారతీయ మార్కెట్లో గేమ్ చేంజర్‌గా నిలుస్తుంది.”
120 kW @ 3600 rpm శక్తి,360 Nm @ 2000-2500 rpm టార్క్‌తో కూడిన నిరూపిత ఇసుజు RZAE 1.9L 4-సిలిండర్ VGS టర్బో ఇంటర్‌కూల్డ్ ఇంజన్ ఆధారిత ఈ ఆంబులెన్స్, అత్యవసర సమయాల్లో వేగవంతమైన స్పందన అందిస్తుంది.
అత్యవసర వైద్య సంరక్షణకు అనుకూలంగా, ఈ డి-మ్యాక్స్ ఆంబులెన్స్ అన్ని రకాల రోడ్లకు అనుకూలంగా ఉంది. ‘బెస్ట్-ఇన్-క్లాస్’ ఫీచర్లు, సహజ సౌలభ్యాలతో అత్యవసర వైద్యసేవలు అందించే సదుపాయాలు కలిగి ఉంది.
AIS-125 టైప్ C నిర్దేశనలకు అనుగుణంగా ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ధర ₹25,99,990/- (ఎక్స్-షోరూమ్, చెన్నై) ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
మరింత సమాచారం కోసం వినియోగదారులు ఇసుజు అధికారిక వెబ్‌సైట్ www.isuzu.in ను సందర్శించవచ్చు.