365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు, అక్టోబర్ 16, 2024: పండుగ సీజన్ ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) ఈరోజు తమ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన అర్బన్ క్రూయిజర్ టైజర్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రత్యేకమైన డిజైన్,ప్రీమియం అనుభవాన్ని అందించడానికి రూపుదిద్దుకుంది. టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టీజీఏ) ప్యాకేజీతో రాబోతున్న ఈ లిమిటెడ్ ఎడిషన్, వినియోగదారులకు రూ. 20,160 విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది.

ఈ సందర్బంగా, టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “టయోటా వద్ద, మేము ఎల్లప్పుడూ మా కస్టమర్‌లకు ప్రత్యేక అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తాం. ఇటీవలే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివ్ ఎడిషన్‌ను విడుదల చేసిన తర్వాత, ఈ పండుగ సీజన్‌కు మరింత ప్రత్యేకతను జోడిస్తూ అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫెస్టివ్ ఎడిషన్‌ను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కొత్త వేరియంట్ మా వినియోగదారులకు గొప్ప విలువను అందిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

1.0L టర్బో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్,6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లలో లభించేది ఈ వాహనం, గరిష్టంగా 100.06 PS @ 5500 rpm శక్తిని అందిస్తుంది. పవర్ ప్యాక్డ్ డ్రైవింగ్ అనుభవం అందించడమే కాకుండా, 1.0L టర్బో మాన్యువల్ వెర్షన్ 21.5* km/l మరియు ఆటోమేటిక్ వెర్షన్ 20.0* km/lతో విభాగంలో అత్యుత్తమ మైలేజీని అందిస్తోంది.

ఈ కొత్త ఎడిషన్ కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా సమీప టయోటా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు: https://www.toyotabharat.com/online-booking/