365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 18,2024: శామ్సంగ్ ఇటీవల తన Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ భారతదేశపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. మిడ్ రేంజ్ విభాగంలో ఈ ఫోన్‌ను విడుదల చేస్తూ, కంపెనీ దీని సాఫ్ట్వేర్ అప్డేట్లకు 6 సంవత్సరాల గ్యారెంటీ ఇస్తోంది. అంటే దీన్ని చాలా కాలం పాటు సురక్షితంగా ఉపయోగించవచ్చు.
గ్లోబల్, ఇండియన్ మోడల్స్ మధ్య ప్రాసెసర్ వ్యత్యాసం..
శామ్సంగ్ గ్లోబల్ మోడల్‌ను Exynos ప్రాసెసర్‌తో విడుదల చేసింది, భారతదేశంలో విడుదలైన మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ గోల్డ్, లైట్ గ్రీన్, బ్లూ, బ్లాక్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇప్పుడు దీని ధరలు, అమ్మకాల వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy A16 5G భారతదేశ ధర, విక్రయ వివరాలు..
Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 21,999కి విడుదల చేసింది. అదే, 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 18,999కి అందుబాటులో ఉంచింది.
ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లు
Samsung Galaxy A16 5G ఫోన్‌ను Samsung India అధికారిక వెబ్సైట్లో, అలాగే Amazon India, Flipkart వంటి ఆన్లైన్ స్టోర్లలో విక్రయించనున్నారు.ఇందులో ఇంకా ప్రత్యేక రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. Samsung ఆఫర్లు చూస్తే, Axis బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫోన్ ధర కాస్త తగ్గుతుంది.
టాప్ ఫీచర్లు, స్పెక్స్
Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ స్లిమ్ డిజైన్‌తో వస్తోంది, దీని వెనుక భాగంలో గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఐలాండ్ ఫ్రేమ్ డిజైన్ కూడా ఉంది. ఈ ఫోన్ వైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP54 రేటింగ్ పొందింది. ఇది నీటి,ధూళి నిరోధకతను అందిస్తుంది.
ఈ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, 90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు, 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ లభిస్తాయి. సెల్ఫీల కోసం 13MP కెమెరా టియర్‌డ్రాప్ డిజైన్‌లో అందుబాటులో ఉంటుంది.
6 సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్లు…
ఈ ఫోన్ 6 సంవత్సరాల సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్లతో వస్తోంది. ఈ కారణంగా దీన్ని చాలా కాలం పాటు సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఇంకా 1 సంవత్సరం వారంటీతో పాటు నాక్స్ సెక్యూరిటీ, ఆటో బ్లాకర్, సెక్యూర్ ఫోల్డర్, ప్రైవేట్ షేర్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.
NFC, Samsung Wallet ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్ కూడా ఈ ఫోన్లో అందుబాటులో ఉంది. వీటితో సులభంగా చెల్లింపులు చేయవచ్చు.