Fri. Oct 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 18,2024: హను కోట్ల తొలిచిత్రం ‘ది డీల్’ : హను కోట్ల, ఈటీవీలో ప్రసారమైన మాయాబజార్ సీరియల్‌లో 150 ఎపిసోడ్స్‌ పూర్తి చేసిన దర్శకుడు, ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తొలి సినిమా ది డీల్తో వెండితెరకు పరిచయమయ్యారు.

ఈ చిత్రాన్ని సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. కథానాయికలుగా చందన, ధరణి ప్రియా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అక్టోబర్ 18న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

కథ..

భైరవ్ (హను కోట్ల) ఒక ప్రమాదంలో గాయపడతాడు. ఆ ప్రమాదం వల్ల అతను తన గతాన్ని మరిచి, తాను తన భార్య లక్ష్మిని (ధరణి ప్రియా) వెతుకుతాడు. కానీ ఆశ్చర్యంగా ఆమె తనను కాదు, మరొకరిని తన భర్తగా పరిచయం చేస్తుంది. ఇది భైరవ్‌కి షాక్ ఇవ్వగా, అతను తన గత జీవితంలోని కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటాడు. అతని స్నేహితుడు గిరి తనను చంపడానికి ప్రయత్నించిన సంఘటన గుర్తుకు వస్తుంది. అదే సమయంలో భైరవ్ తన భార్య లక్ష్మి వేరే వ్యక్తితో ఉంటుందని అనుమానిస్తాడు.

భైరవ్‌కి తన మెదడు సరిగా పని చేయడంలేదని డాక్టర్ చెబుతాడు. కానీ భైరవ్ తన అనుమానాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. గిరితో జరుగుతున్న సంఘటనలలో మరింత సంక్లిష్టత తెస్తూ, చివరకు గిరి, భైరవ్ ఇద్దరూ ఒక ఇంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తుంది. తన భార్య లక్ష్మి నిజంగా ఎవరు? ఆమె ఏం దాచిపెడుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే క్రమంలో కథ మరింత ఉత్కంఠ భరితంగా మారుతుంది.

విశ్లేషణ..

ఈ సినిమా ప్రారంభం కొంచెం నెమ్మదిగా సాగినా, సెకండాఫ్ లో సస్పెన్స్, డ్రామా మరింత ఆసక్తికరంగా ఉంటాయి. భైరవ్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ బాగుంది, ప్రత్యేకించి అసలు అతను ఎవరో రివీల్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ వరకు కొనసాగే ట్విస్ట్‌లు, ప్రీ క్లైమాక్స్‌లో మొదలయ్యే ఉత్కంఠ, సినిమాకు ప్లస్ పాయింట్లు. దర్శకుడు కథలో రసాన్ని, ట్విస్ట్ లను బాగా తెరకెక్కించినప్పటికీ, సినిమా స్క్రీన్‌ప్లేలో కొంత గ్రిప్పింగ్ మిస్ అయింది.

సినిమా మొదటినుంచి కొంత స్లోగా సాగుతుంది, కానీ మద్యలోని ట్విస్ట్‌లు కొంత రిలీఫ్ ఇస్తాయి. కుటుంబానికి సంబంధించిన ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ప్రత్యేకించి, అమ్మ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ లో చూసే సినిమా అని చెప్పవచ్చు. రేటింగ్: 3/5..

error: Content is protected !!