Tue. Oct 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 20, 2024: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చ రించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో, సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ అల్పపీడనం సోమవారం నాటికి ఏర్పడి, 23వ తేదీ నాటికి ఉత్తర వాయువ్య దిశకు కదులుతుందని అంచనా. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ములుగు, హైదరాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఆదివారం నాటికి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, రంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుందని అంచనా. సోమ, మంగళవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!