Thu. Dec 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 10 నవంబర్ 2024: ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో కీలకమైన రోడ్ సేఫ్టీ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమం ,  హెచ్ఎంఎస్ఐ ,కొనసాగుతున్న ప్రాజెక్ట్ – మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కీలక కార్యక్రమం , చిన్న వయస్సు నుండే రహదారి భద్రతా స్పృహను పెంపొందించడంలో సంస్థ అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 100 కి పైగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు శ్రీమతి రజిత, సెక్టోరల్ ఆఫీసర్, ఎడ్యుకేషన్,  హైదరాబాద్ జిల్లా, తెలంగాణ; కధిరవన్ పళని, ఐఏఎస్  అదనపు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ; బానోత్ వెంకటేశ్వర్లు, ఉప విద్యాశాఖాధికారి, నాంపల్లి జోన్ , హైదరాబాద్ జిల్లా, తెలంగాణ; హర్‌ప్రీత్ సింగ్, జనరల్ మేనేజర్-సేఫ్టీ రైడింగ్ విభాగం, కార్పొరేట్ వ్యవహారాలు, హెచ్ఎంఎస్ఐ  కూడా   పాల్గొన్నారు. 

భారతదేశంలో సవాలుగా మారుతున్న ట్రాఫిక్ వాతావరణంలో, హెచ్ఎంఎస్ఐ బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తనను రూపొందించడంలో విద్య ,మనస్తత్వ అభివృద్ధి కీలక పాత్రను నొక్కి చెబుతుంది. విద్యార్థులు, కమ్యూనిటీలలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని తెలుపడానికి ఈ సమావేశం ఉద్దేశించబడింది.

భారతదేశంలోని ప్రస్తుత ట్రాఫిక్ వాతావరణంలో క్రమశిక్షణతో కూడిన రహదారి వినియోగం యొక్క ఆవశ్యకతను వెల్లడించటంతో, హెచ్ఎంఎస్ఐ పిల్లలలో  ‘ముందు భద్రత’-అనే ఆలోచనను కలిగించడానికి రూపొందించిన వినూత్న విద్యా మాడ్యూళ్లను ప్రదర్శించడంపై దృష్టి సారిస్తుంది.

హెచ్ఎంఎస్ఐ యొక్క గ్లోబల్ సేఫ్టీ స్లోగన్ ‘అందరికీ భద్రత’ ద్వారా ,  ఈ ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన వయస్సు-నిర్దిష్ట మాడ్యూల్స్ పాఠశాల పాఠ్యాంశాలలో విలీనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి, విద్యార్థులకు అవసరమైన రహదారి భద్రత పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తాయి.

ఎడతెగని ప్రయత్నాలతో, హెచ్ఎంఎస్ఐ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 రోడ్డు భద్రతా సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది, అవి ఇప్పటికే 1200 పాఠశాలలకు పైగా చేరాయి,దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన విద్యనందించాయి. ఈ విజయాల ఆధారంగా, హెచ్ఎంఎస్ఐ రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు తన రహదారి భద్రతా కార్యక్రమాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది.

రోడ్డు భద్రత పట్ల హోండా మోటర్‌సైకిల్ & స్కూటర్ ఇండియా యొక్క సీఎస్ఆర్  నిబద్ధత:

ఏప్రిల్ 2021 సంవత్సరంలో, హోండా ప్రపంచవ్యాప్తంగా 2050 సంవత్సరానికి  హోండా మోటర్‌సైకిల్స్,ఆటోమొబైల్స్‌కు సంబంధించిన వాహనాలతో జీరో ట్రాఫిక్ ఢీకొన్న మరణాల కోసం ప్రయత్నిస్తుంది. ఈ విస్తృత స్థాయి సిఎస్ఆర్ వ్యూహం 2030 నాటికి మరణాలను సగానికి తగ్గించాలనే భారత ప్రభుత్వ లక్ష్యంకు అనుగుణంగా భారతదేశంలో హెచ్‌ఎంఎస్‌ఐ ఈ లక్ష్యం తో పని చేస్తోంది.

సమాజం ఉనికిలో ఉండాలని కోరుకునే సంస్థగా హెచ్ఎంఎస్ఐ కృషి చేస్తుంది.పాఠశాల పిల్లల నుండి కార్పొరేట్లు,సమాజం వరకు ప్రతి విభాగానికి ప్రత్యేకమైన ఆలోచనలతో సమాజంలోని అన్ని వర్గాలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఒక కీలకమైన అంశం ఏమిటంటే, 2030 నాటికి మన పిల్లల్లో రోడ్డు భద్రత పట్ల సానుకూల ఆలోచనను పెంపొందించడం. ఆ తర్వాత వారికి విద్యను కొనసాగించడం.

కంపెనీ సమగ్ర రహదారి భద్రతా కార్యక్రమాలలో దేశవ్యాప్తంగా మా దత్తత తీసుకున్న 10 ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కులు మరియు 6 సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లలో రోజువారీ సెషన్‌లు ఉంటాయి. సమాజంలోని ప్రతి భాగానికి రహదారి భద్రతా విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి మా నైపుణ్యం కలిగిన భద్రతా బోధకులు ఈ సెషన్‌లను నిర్వహిస్తారు. హెచ్ఎంఎస్ఐ రహదారి భద్రతా కార్యక్రమాలు 7.7 మిలియన్ల భారతీయులను ప్రభావితం చేశాయి.

Leave a Reply

error: Content is protected !!