Thu. Dec 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,14 నవంబర్, 2024: టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ సంవత్సరాంతంలో తన ప్రముఖ మోడళ్లైన గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ల ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కస్టమర్లకు మరింత విలువ చేకూర్చేలా రూపొందించిన ఈ ఎడిషన్‌ మోడళ్లలో టొయోటా అసలైన యాక్సెసరీ ప్యాకేజీలతో అదనపు ప్రత్యేకతను అందిస్తోంది.

అంతేకాకుండా, గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్, రూమియన్ (CNG మోడళ్లను మినహాయించి)పై రూ. 1 లక్ష పైన అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2024 వరకు కొనసాగుతుంది. కస్టమర్ ఫస్ట్ దృక్పథంతో టొయోటా ఈ ఆఫర్‌లు అందజేస్తోంది.

error: Content is protected !!