365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,15 నవంబర్ 2024: ఈరోజు బాలల దినోత్సవాన్ని భారతదేశం జరుపుకుంటున్న వేళ, తమ బిడ్డకు పాలు ఇవ్వడంలో హేతుబద్ధతను అర్థం చేసుకోవడానికి భారతీయ తల్లిదండ్రుల నడుమ గోద్రెజ్ జెర్సీ ఒక సర్వే నిర్వహించింది.
కొంత శక్తిని అందించటంతోపాటు ఫిట్నెస్, బరువు నిర్వహణ అవసరాలను తీరుస్తాయని, భోజన ప్రత్యామ్నాయంగా కొందరు వెల్లడించగా హైదరాబాద్కు చెందిన 66% ,దేశవ్యాప్తంగా 60% తల్లిదండ్రులు తమ పిల్లలకు కాల్షియం అందించటం కోసం పాలు ఇస్తున్నామని చెప్పారు.
ఢిల్లీ, లక్నో, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు,కోల్కతా నగరాలలో ‘బాటమ్స్ అప్…ఇండియా సేస్ చీర్స్ టు మిల్క్!’ అనే శీర్షికతో నిర్వహించబడిన ఈ అధ్యయనం, వినియోగదారుల ప్రాధాన్యతలు, పరిశ్రమల పోకడలపై విలువైన పరిజ్ఙానం అందిస్తుంది.
తమ బిడ్డకు పాలు ఇవ్వడానికి తల్లిదండ్రుల హేతువును అర్థం చేసుకోవడంతో పాటు, వారు తమ పిల్లల కోసం ఏ తరహా పాల ఉత్పత్తులను ఇష్టపడతారో కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ ఫలితాలపై గోద్రెజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా,భారతదేశంలో అనేక పరిశోధనలు పాలలో పోషక విలువలను గురించి తెలిపాయి. పిల్లలకు ఇవి మంచి చేస్తాయని నిరూపించాయి.
అధిక పోషకాహార ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్ ,విటమిన్ ఎ పాలలో ఉంటాయి. ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. ఈ నేపథ్యం లో , తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడుతున్నారో మా వినియోగదారుల సర్వే ద్వారా మరింత స్పష్టంగా చూడటం ప్రోత్సాహకరంగా ఉంది” అని అన్నారు.