365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జనవరి 28, 2025: టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ టాటా క్యాపిటల్ లిమిటెడ్ (టీసీఎల్) తన ప్రత్యేకమైన విద్యా రుణ ఆఫర్లతో విద్యార్థుల ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో మద్దతు ఇస్తోంది.
విద్యార్థులు తమ భవిష్యత్తు కొరకు ఉత్తమ కోర్సులు ఎంపిక చేసుకునే ప్రస్తుత సందర్భంలో, టాటా క్యాపిటల్ వారు వారు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
మేనేజ్ మెంట్స్ ఎంట్రన్స్ (క్యాట్, ఎక్స్‌ఏటీ, స్నాప్), విదేశాల్లో ఉన్నత విద్య కోర్సులకు అవసరమైన ప్రామాణిక పరీక్షలు (జీఆర్ఈ, శాట్, జీమ్యాట్),ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యాన్ని నిర్దేశించే (ఐఈఎల్టీఎస్, టోఫెల్) పరీక్షల ఫలితాలతో విద్యార్థులు భవిష్యత్తుకు పట్టు పడుతున్నారు. టాటా క్యాపిటల్, ఈ సమయంలో సౌకర్యవంతమైన విద్యా రుణాలను అందిస్తూ, విద్యార్థుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చింది.
విద్యా ఖర్చుల భారాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా చేసుకున్న టాటా క్యాపిటల్, రూ.85 లక్షల వరకు పూచీకత్తు లేకుండా విద్యా రుణాలను అందిస్తుంది. ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు, స్టడీ మెటీరియల్, ఇతర అవసరాలకు సంబంధించి సమగ్ర రుణాలు అందించేందుకు కంపెనీ ప్రణాళికలు చేపట్టింది. తక్షణమే రుణాల అందుబాటును పెంచడం కోసం అడ్మిషన్ లెటర్లను పొందకముందే కస్టమర్లకు రుణం అందించే విధానాన్ని చేపట్టింది.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ వంటి నగరాల్లో విద్యార్థులు విదేశీ విద్యకు మొగ్గుచూపుతున్నారు. టాటా క్యాపిటల్ వారు ఈ అవసరాలను సమర్థంగా తీర్చేందుకు తమ సేవలను విస్తరిస్తున్నారు. అమెరికా, యూకే, జర్మనీ, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో చదువుకోడానికి విద్యార్థులు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు.
స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాలలో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. టాటా క్యాపిటల్, డిజిటల్ ప్రక్రియ ద్వారా శీఘ్రంగా రుణాలను అందించడమే కాకుండా, కస్టమర్ల అవసరాలను వేగంగా, కచ్చితంగా తీర్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
2023 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సేవకు ఇప్పటికే 6,000కి పైగా రుణ దరఖాస్తులు అందివచ్చాయి. టాటా క్యాపిటల్, 900కు పైగా శాఖలతో దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించింది.