365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,హైదరాబాద్, ఫిబ్రవరి 7, 2025:తెలుగు ప్రేక్షకులను సంగీత స్రవంతిలో ఓలలాడించిన జీ తెలుగుకు చెందిన ప్రముఖ మ్యూజికల్ రియాలిటీ షో సరిగమప 16 – ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది.
పలువురు యువ ప్రతిభావంతుల గాత్ర మాధుర్యంతో అలరించిన ఈ సీజన్ ముగింపు ఘట్టాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జీ తెలుగు సిద్ధమైంది. ఫిబ్రవరి 9, ఆదివారం సాయంత్రం 6 గంటలకు, ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కోసం ఆరుగురు ఫైనలిస్టులు తుది పోరుకు రంగంలోకి దిగనున్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2025/02/zee-telugu.jpg)
ఈ సందడిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతుండగా, సీనియర్ నటి రాధ, నటుడు విశ్వక్ సేన్ ఈ గ్రాండ్ ఫినాలేకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు.
ఇది కూడా చదవండి:హైదరాబాద్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన యూనిపోల్స్ తొలగింపు
This Also Read: Sai Pallavi & Naga Chaitanya at Sa Re Ga Ma Pa 16 Finale..!
అంతేకాదు, ప్రముఖ గాయని మంగ్లీ ప్రత్యేక పాటను ఆలపించనుండగా, ఫిక్షన్ ఆర్టిస్టులు నిసర్గ గౌడ, ప్రీతి శర్మ, అభినవ్, సంగీత, పృథ్వీ, సాయి కిరణ్ ఫైనలిస్టులకు మద్దతుగా హాజరవుతున్నారు.
ఈ సీజన్‌కు శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈసారి విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలొడీస్ అనే మూడు జట్లుగా గాయనులను విభజించి, మెంటర్లుగా రేవంత్, రమ్య బెహర, అనుదీప్ దేవ్ మార్గదర్శకత్వం వహించారు. కఠినమైన రౌండ్లను దాటుకొని సాత్విక్, మేఘన, వైష్ణవి, మోహన్, అభిజ్ఞ, మానస ఫైనల్ పోరుకు అర్హత సాధించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2025/02/zee-telugu.jpg)
ఈ గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ “ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్” టైటిల్‌తో పాటు ₹10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోనున్నారు. ఉత్కంఠతతో సాగనున్న ఈ చివరి పోరును మిస్ కాకుండా, మీ జీ తెలుగులో ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు తప్పకుండా వీక్షించండి!