365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 10,2025: హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధిక సంఖ్యలో వినిపిస్తున్నారు. సోమవారం జరిగిన సమావేశంలో మొత్తం 64 ఫిర్యాదులు అందాయి.

ముఖ్యంగా పార్కుల పరిరక్షణ, రహదారుల అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్) భద్రత తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు.

హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను గూగుల్ మ్యాప్స్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్‌తో పొల్చి, తగిన విచారణ చేపట్టాలని సూచించారు.

Read this also…Aishwarya Rajesh Inaugurates ‘Kolors Healthcare 2.0’ in Hyderabad

ఇది కూడా చదవండి..రూపాయి అస్థిరతపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..?

గత దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు ప్రజావాణి ద్వారా వెలుగు చూస్తున్నాయని, వీటి పరిష్కారానికి వారంలోనే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, బాధితులతో సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల ప్రధాన ఫిర్యాదులు:
➡ మల్కాజిగిరి ఆర్‌కేపురం ఆఫీసర్ల కాలనీలో 3 వేల గజాల పార్కు స్థలం ఆక్రమణకు గురైందని ఆర్మీ ఆఫీసర్ల సంక్షేమ సంఘం ఫిర్యాదు.

➡ కూకట్పల్లి జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న సుభోధ, స్వగృహ హౌసింగ్ సొసైటీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని నివాసితుల ఫిర్యాదు.

➡ అంభీర్ చెరువు, ఆదిత్యనగర్‌లో ప్రజావసరాలకు కేటాయించిన 2 వేల గజాల స్థలం ఆక్రమణకు గురవుతోందని కాలనీవాసుల ఆందోళన.

➡ పోచారం మున్సిపాలిటీ, ఘటేకసర్, జయపురి కాలనీ – 1968లో వేసిన 56 ఎకరాల గ్రామపంచాయతీ లేఅవుట్‌లో అక్రమ నిర్మాణాలు, విల్లాల నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదులు.

➡ ఏకశిలానగర్ కాలనీలో పార్కుల స్థలాలు, ప్రజావసరాల స్థలాలపై ఆక్రమణలు. కాలనీలోకి వెళ్లే 50 అడుగుల రహదారిలో 15 అడుగుల మేర స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వాహనాల పార్కింగ్ చేసుకోవడం వల్ల వాసులకు తీవ్ర ఇబ్బందులు.

Read this also…Teaser Out Now! Sony LIV Presents Ram Madhvani’s The Waking of a Nation – Streaming from March 7

Read this also…Canon India Unveils ‘I #CANwithCanon’ Campaign, Showcasing Real Stories of Transformation

➡ కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ, బౌరంపేట గ్రామం – డాలర్ మెడోస్ కాలనీలో రహదారి లేకపోవడంతో నివాసితుల ఆందోళన. లేఅవుట్ ప్రకారం దారి చూపించాలని హైడ్రా అధికారులను కోరారు.

తక్షణ చర్యలకు హైడ్రా సిద్ధం
కమిషనర్ రంగనాథ్ వారంలోనే సమస్యలపై విచారణ జరిపి, బాధితులను సమావేశపరిచి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి అధికారికంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.