365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్, ఫిబ్రవరి 20, 2025: భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ CUV అయిన MG విండ్సర్ 15,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించినట్లు JSW MG మోటార్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
2024 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు వరుసగా నాలుగు నెలలు బెస్ట్-సెల్లింగ్ EVగా నిలిచిన విండ్సర్, దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగానికి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాముఖ్యతను చాటుతోంది.
Read this also...JSW MG Motor India Achieves 15,000-Unit Production Milestone for MG Windsor
Read this also...ISB Study Highlights Challenges and Opportunities in AI Adoption for Tuberculosis Diagnosis in India
ఇది కూడా చదవండి…పరిశ్రమలోనే తొలిసారిగా 30 ఏళ్ల డిఫర్‌మెంట్ ఆప్షన్‌తో బజాజ్ అలయంజ్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ II
Read this also...Bajaj Allianz Life Launches Guaranteed Pension Goal II with Industry-First 30-Year Deferment Option
ఈ సందర్భంగా JSW MG మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బిజు బాలేంద్రన్ మాట్లాడుతూ, “MG విండ్సర్‌కు వస్తున్న విశేషమైన స్పందనతో మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. 15,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంలో మాకు మద్దతుగా నిలిచిన మా కస్టమర్లకు కృతజ్ఞతలు.
అందుబాటులో ఉన్న ధర, సొగసైన డిజైన్, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలు విండ్సర్‌ను అత్యంత ప్రజాదరణ పొందిన EVగా నిలిపాయి. అలాగే, బాటరీ యాజమాన్యం కోసం ‘BaaS’ (Battery as a Service), బైబ్యాక్ ప్రోగ్రాం, జీవితకాల వారంటీ వంటి వినూత్న కార్యక్రమాలు వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.” అని అన్నారు.

విండ్సర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని బిజు బాలేంద్రన్ వెల్లడించారు. “MG సెలెక్ట్ ద్వారా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగా, సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
Read this also…KBC Global Ltd Approves 1:1 Bonus Issue; Plans Expansion and Debt Reduction
Read this also…“Axis Bank & Hurun India Unveil 2024 List of India’s 500 Most Valuable Private Companies”
ఇది కూడా చదవండి…ప్రజారోగ్య వైద్యులకు టైం బౌండెడ్ ప్రొమోషన్స్ కల్పించాలి: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
ఈ కారణంగా ఫిబ్రవరి నెలలో ఉత్పత్తి కొంత తగ్గవచ్చని అంచనా వేస్తున్నాం, ఇది తాత్కాలికంగా మా హోల్‌సేల్స్‌పై ప్రభావం చూపొచ్చును” అని పేర్కొన్నారు.
JSW MG మోటార్ ఇండియా త్వరలో భారత మార్కెట్లో MG సైబర్‌స్టెర్, MG M9 పేరుతో రెండు కొత్త వాహనాలను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి ‘MG సెలెక్ట్’ అనే కంపెనీ ప్రత్యేక ‘అయాక్సిసబుల్ లగ్జరీ’ బ్రాండ్ ఛానల్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.