365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 25, 2025: ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై’. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరో, హీరోయిన్లు గా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకనిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ,
“సినిమా చిన్నదా? పెద్దదా? అనే విషయం ప్రేక్షకులకు ముఖ్యం కాదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ‘ప్రేమకు జై’ ట్రైలర్, పాటలు, విజువల్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు శ్రీనివాస్ మల్లం మంచి ప్రతిభ చూపించారు. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం ఉంది” అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ,”ఈ సినిమా గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించాం. హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. నటీనటుల, టెక్నీషియన్ల అంకితభావంతో సినిమా ఈ స్థాయికి వచ్చింది. మా నిర్మాత కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ‘ప్రేమకు జై’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము” అన్నారు.
Read this also…Muthoot Finance Launches ‘Sunheri Soch Season-3’
Read this also…Digital India Bill: Steps Being Taken to Curb Obscene Content
కో ప్రొడ్యూసర్ మైలారం రాజు మాట్లాడుతూ, “యూత్‌కి నచ్చే స్టోరీతో దర్శకుడు ఈ సినిమాను చాలా బాగా తీర్చిదిద్దారు. వచ్చే నెలలో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి జై కొడతారని ఆశిస్తున్నాం” అన్నారు.
హీరో అనిల్ బురగాని, హీరోయిన్ ఆర్. జ్వలిత మాట్లాడుతూ,”ఇంత మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ‘ప్రేమకు జై’ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.
‘ప్రేమకు జై’ ఫ్రీరిలీజ్ వేడుకలో నటుడు అధిరే అభి, నిర్మాత ఎమ్.ఆర్. చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్ గౌడ్, దర్శకుడు లారెన్స్ తదితర సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమాను వచ్చే నెలలో థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.