365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 27,2025 : రెండు రకాల వీసాల మధ్య చాలా తేడా ఉంది. ప్రస్తుత EB-5 స్కీం ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు అమెరికా కంపెనీలలో $8 మిలియన్ల నుంచి $1 మిలియన్ల వరకు పెట్టుబడి పెట్టాలి.
అంతేకాదు కనీసం 10 కొత్త ఉద్యోగాలను సృష్టించాలి. గ్రీన్ కార్డ్ కోసం 5 నుంచి 7 సంవత్సరాలు వేచి ఉండాలి.అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ పథకాన్ని ప్రకటించారు.
ఇది కూడా చదవండి...ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ ప్లాన్ భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి...భారతదేశంలో అభివృద్ధి చెందేందుకు పని గంటలు సహాయ పడుతున్నాయా..?
ఇది కూడా చదవండి...ప్రపంచంలో అత్యధిక పని గంటలు చేసే దేశాలు ఏవి..?
5 మిలియన్ల డాలర్ల రుసుము చెల్లించి వలసదారులు అమెరికాలో ఉండటానికి అనుమతి పొందవచ్చని వెల్లడించారు. ఇది చాలా పాతదే. 35 ఏళ్ల నాటి EB-5 వీసా స్కీం. EB వీసా స్కీం కింద, ఏ వ్యక్తి అయినా $1 మిలియన్ పెట్టుబడి పెట్టడం ద్వారా అమెరికాలో నివాస అనుమతి పొందవచ్చు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 1990లో ప్రారంభించిన ఈ స్కీం, గత కొన్నిసంవత్సరాలుగా దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ కార్డ్ వీసా ప్లాన్ రుసుము ఐదు రెట్లు పెరిగి $5 మిలియన్లకు చేరుకుంది. అధిక వ్యయం కారణంగా, మధ్యతరగతి వారికి ఈ పథకం అందకపోవచ్చు.
భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Read this also…Hyderabad Rises to Second Spot in India’s Office Leasing Market with Record 52% Growth in 2024
Read this also…MG Cyberster Sets Record as Fastest Accelerating EV at Sambhar Salt Lake
5 మిలియన్ల డాలర్ల ఖర్చు అంటే భారతదేశంలోని అత్యంత ధనవంతులు, పెద్ద వ్యాపారవేత్తలు మాత్రమే అమెరికాలో స్థిరపడటానికి ఈ స్కీం ను పొందగలుగుతారు. ఇది ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న నైపుణ్యం కలిగిన నిపుణుల సమస్యలను పెంచవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇలా వేచి ఉండటం దశాబ్దాలు కూడా పట్టవచ్చు.
చెల్లింపు నగదు రూపంలోనే..

EB-5 కింద దరఖాస్తు చేసుకునే వారు రుణం పొందవచ్చు లేదా నిధులు సేకరించవచ్చు, అయితే గోల్డ్ కార్డ్ మొత్తం చెల్లింపును నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన భారతీయులలో ఎక్కువ మందికి ఇది అందుబాటులో ఉండదు.
ఇది కూడా చదవండి...JSW MG మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా అనురాగ్ మెహ్రోత్రా నియామకం
Read this also…JSW MG Motor India Appoints Anurag Mehrotra as Managing Director
H-1B వర్క్ వీసా ఇప్పటికీ భారతీయులకు అత్యంత ఇష్టపడే మార్గం. H-1B వీసా ఉన్న భారతీయులు కూడా గోల్డ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే వారికి $5 మిలియన్లు చెల్లించగల సామర్థ్యం ఉంటుంది.