365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 19, 2025: వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు వర్చుసా ఫౌండేషన్ ముందుకొచ్చింది. తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 10 సోలార్ పవర్డ్ బోర్లు ఏర్పాటు చేసి, అడవి జంతువులకు నిరంతర నీటి వనరులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ప్రాజెక్ట్, మానవ-వన్యప్రాణుల మధ్య జరిగే సంఘర్షణలను తగ్గించడంతో పాటు, స్థానిక చెంచు గిరిజనులకు నీటి కొరత సమస్య నుంచి ఉపశమనం కలిగించేలా ఉంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్రత్యేక జీవ వైవిధ్య ప్రాంతం. ఈ టైగర్ రిజర్వ్‌లోని మన్నానూర్, అమ్రాబాద్, మద్దిమడుగు అటవీ శ్రేణుల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్ బోర్లు, పులులు, అడవి పందులు, నీల్గాయ్, బ్లాక్‌బక్ వంటి జంతువులకు నీటి కొరత లేకుండా ఉంటుందని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.
Read this also…Virtusa Foundation Boosts Wildlife Conservation with Solar Borewells in Amrabad Tiger Reserve
ఇది కూడా చదవండి…హైదరాబాద్‌లో ఐదు రోజుల ‘గౌ కథ’ ప్రవచనాలు – గోరక్షణపై శ్రద్ధే గోపాల్ సరస్వతీజీ సందేశం
ఈ సోలార్ బోర్లు సూర్యోదయంతో ప్రారంభమై, సూర్యాస్తమయానికల్లా స్వయంచాలకంగా ఆగిపోతాయి. దీనివల్ల మానవ జోక్యం లేకుండానే జంతువులు స్వేచ్ఛగా నీరు తాగేందుకు వీలవుతుంది. అలాగే, వ్యూహాత్మకంగా జంతు కారిడార్ల వెంట ఏర్పాటు చేయడం ద్వారా వేసవి కాలంలో నీటి కొరత సమస్యను అధిగమించేందుకు దోహదం చేస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌పై వర్చుసా ఫౌండేషన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీ అమిత్ బజోరియా మాట్లాడుతూ, “జీవ వైవిధ్య పరిరక్షణలో ఇది ఓ ముఖ్యమైన ముందడుగు. సమాజ సంక్షేమాన్ని మెరుగుపరిచే విధంగా, పర్యావరణ స్థిరత్వాన్ని పెంచేలా వర్చుసా పని చేస్తోంది. పునరుత్పాదక శక్తిని వినియోగించడం ద్వారా ప్రకృతికి మేలు చేయడమే మా లక్ష్యం” అన్నారు.
వర్చుసా, పర్యావరణ స్థిరత్వానికి అంకితమైన సంస్థగా వరుసగా మూడేళ్లుగా CDP రేటింగ్‌లు, రెండు సంవత్సరాలుగా ఎకోవాడిస్ గోల్డ్ సర్టిఫికేట్‌ను పొందింది. అలాగే, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల నియంత్రణకు Science Based Targets Initiative (SBTi) ద్వారా తన లక్ష్యాలను ధృవీకరించుకుంది.
ఇది కూడా చదవండి…వాట్సాప్ హ్యాక్ అయిందా..? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..!
Read this also…OPPO India builds on the popularity of F Series with the highly-anticipated F29 Series
వర్చుసా కార్పొరేషన్ ఒక ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, మీడియా, మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. “ఇంజనీరింగ్-ఫస్ట్” సిద్ధాంతంతో, వినూత్న పరిష్కారాలను అందిస్తూ, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.