365తెలుగు డాట్ కామ్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 23,2025: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కోర్టులో నడుస్తున్న వివాదం పరిష్కారమైన నేపథ్యంలో, బుధవారం ఆయన కుంటను ప్రత్యక్షంగా పరిశీలించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు ఆరంభం పలికారు.

ఇది కూడా చదవండి…భారతదేశంలో గిగ్ వర్కర్లకు పెన్షన్, ఆరోగ్య సౌకర్యాలు

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ‘‘వచ్చే బతుకమ్మ పండుగ నాటికి కుంట అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం. యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తాం. చెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాలకు అందంపెరిగి, పర్యావరణానికి మేలు జరుగుతుంది,’’ అని తెలిపారు.

పనుల పూర్తికి అధికారులను కట్టుబాటు చేశారు. స్థానిక ప్రజల సహకారం ఎంతో అవసరమని, అందరూ ముందుకు రావాలని కోరారు.

ఇది కూడా చదవండి…జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ఉగ్రదాడి: పహల్గామ్‌లో 28 మంది దుర్మరణం..

కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై, అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.