365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే10, 2025: అమ్మ అంటే ఆలనా, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక షార్ట్ మూవీ ‘అమ్మ’.

ఏఏఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో ఈ షార్ట్ ఫిలిం.. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మే 11న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి తెర‌పై ‘అమ్మ’గా లాలించ‌బోతోంది. ఇంద్రాణి దవలూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన “అందెల రవమిది” మూవీ విడుద‌ల‌కు ముందే ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌ అవార్డులు అందుకుంది.

తాజాగా ‘అమ్మ’ మూవీలోనూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. తాజాగా ఇంద్రాణి న‌టించిన ‘అమ్మ’ షార్ట్ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ అమ్మ కథను చూపించే సందేశాత్మక చిత్రమే మా ‘అమ్మ’ మూవీ అని అన్నారు.

ఈ షార్ట్ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, “మనకి కష్టం వస్తే కన్నీరు కార్చే అమ్మకే బాధ కలిగిస్తే ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపించే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ఇదే మా మూవీ సబ్జెక్ట్,” అని తెలిపారు.

ఈ చిత్రంలో ఇంద్రాణి దవలూరు, సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని త‌దిత‌రులు న‌టించారు. సంగీతం కె.వి. భరద్వాజ్ అందించగా, సినిమాటోగ్రఫీ కార్తీక్ కళ్లూరి సమకూర్చారు.

ఇది కూడా చదవండి…పలు రైళ్లు రద్దు.. ప్రయాణికులకు అసౌకర్యం..

This is also read..Essential Precautions to Take Before Laser Hair Removal

హరీష్ బన్నాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ మూవీ అమ్మ గొప్పతనాన్ని, త్యాగాన్ని తెలియజేస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకనుంది. త్వరలో విడుదల కానున్న ‘అమ్మ’ చిత్రం అప్పుడే మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బ్యానర్: AAR ఫిల్మ్ మేకర్స్
టైటిల్: అమ్మ
నటీనటులు: ఇంద్రాణి దవలూరు, సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని త‌దిత‌రులు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ బన్నాయ్
సంగీతం: కె.వి. భరద్వాజ
కెమెరా: కార్తీక్ కల్లూరి
పీఆర్వో: అశోక్ ద‌య్యాల‌, క‌డ‌లి రాంబాబు.