365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగుళూరు, మే 19,2025: Gen Z కస్టమర్ల ఫ్యాషన్ అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఫ్యాషన్ తన ప్రత్యేకమైన ఆన్లైన్ స్టోర్ఫ్రంట్ ‘నెక్స్ట్ జెన్ స్టోర్’ను ‘సర్వ్ (SERVE) – డిషింగ్ ఔట్ స్టైల్’గా మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ రీబ్రాండింగ్‌తో భారతదేశపు మొబైల్-ఫస్ట్ తరం అయిన Gen Zకు మరింత చేరువయ్యేలా కంపెనీ ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి…దక్షిణ భారతదేశంలో టొయోటా ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రారంభం
ఇది కూడా చదవండి…ఇసుజు మోటార్స్ ఇండియా తిరుపతిలో కొత్త 3S ఫెసిలిటీ ప్రారంభం
తాజా ట్రెండ్స్, అందుబాటు ధరలు, వ్యక్తిత్వ ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చే Gen Z డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్టోర్‌లో 350కి పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 2 మిలియన్లకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. బార్సినో, టోక్యో టాకీస్, ద బేర్ హౌస్, దిల్జీత్ x లివైస్ వంటి పాపులర్ బ్రాండ్లు ఇందులో భాగమయ్యాయి.

‘సర్వ్’లో నెలవారీ ట్రెండ్ అప్డేట్స్, సీజనల్ లుక్బుక్లు, క్రియేటర్ల స్టైల్ ఎడిట్లు లభించనున్నాయి. Y2K రీట్రో ఫ్యాషన్, జెండర్ ఫ్లూయిడ్ స్టైల్, కె-బ్యూటీ, మినిమలిస్ట్ గ్లామ్ వంటి మైక్రోట్రెండ్లు ఇక్కడ హైలైట్ కానున్నాయి.
Gen Z లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగా డిజైన్ చేయబడిన ఈ ప్లాట్‌ఫారమ్ లోగో, ఫొటో స్టైల్, స్వరం మొదలైనవన్నీ కొత్తదనం కలిగినవే. న్యూ డిజిటల్ యుగానికి తగినట్టుగా ఈ స్టోర్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది.

‘‘Gen Zను దృష్టిలో ఉంచుకుని గతంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన స్టోర్‌కు కొనసాగింపుగా ఇప్పుడు SERVE ద్వారా మేము మరింత ముందుకెళ్తున్నాం,’’ అని అమెజాన్ ఫ్యాషన్ ఇండియా డైరెక్టర్ నిఖిల్ సిన్హా తెలిపారు.
‘అందుబాటులో ఉండే ధరల్లోనే స్టైలిష్ లుక్స్‌ను అందించడం, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించడం మా లక్ష్యం. ప్రత్యేకించి II, III శ్రేణి నగరాలైన చండీగఢ్, కొచ్చీ, జైపూర్, నాగ్‌పూర్ లాంటి ప్రాంతాల్లో Gen Z వినియోగదారుల నుంచి ఎక్కువ స్పందన వస్తోంది,’’ అని పేర్కొన్నారు.
Read This also…Muthoot FinCorp Launches New SRK Gold Loan Campaign..
Read This also…Trump Ally Laura Loomer Claims Biden’s Health in Rapid Decline..
అమెజాన్ చేసిన అంతర్గత అధ్యయనంలో Gen Z వినియోగదారుల ప్రధాన లక్షణాలుగా ‘ద ట్రెండ్ హ్యాకర్’, ‘ద ఎలివేటెడ్ ఎవరిడై-ఇస్ట్’ లాంటి వ్యక్తిత్వం ఆధారిత సెగ్మెంట్లు గుర్తించబడ్డాయి. వాటినే ఆధారంగా చేసుకుని SERVEలో ‘క్లీన్ గర్ల్’, ‘మాబ్ వైఫ్ కోర్’, ‘సాఫ్ట్ బోయ్ ఎనర్జీ’ వంటి స్టైల్ విభాగాలు ప్రవేశపెట్టబడ్డాయి.
ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధులు, ‘‘SERVE కేవలం ఫ్యాషన్ షాపింగ్ స్టోర్ మాత్రమే కాదు… ఇది యువత కోసం ఒక సాంస్కృతిక వేదిక. తమ అభిరుచుల ప్రకారం ఫ్యాషన్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. స్టైల్ అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుంది’’ అని తెలిపారు.