365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి, మే 22,2025: యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ టీజర్ మంగళవారం విడుదలైంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

సరిగ్గా 1 నిమిషం 34 సెకన్ల నిడివి గల ఈ వీడియోను హీరో హృతిక్ రోషన్ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి…EV రంగంలో దూసుకెళ్తున్న JSW MG మోటార్ ఇండియాMG Windsor Exclusive PRO వేరియెంట్ విడుదల..

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు వార్ ఫ్రాంచైజీలోకి స్వాగతం పలుకుతూ.. “ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఎన్టీఆర్.. సిద్ధంగా ఉండండి. ఇక్కడ దయకు చోటు లేదు. నరకానికి స్వాగతం. ప్రేమతో.. కబీర్” అంటూ హృతిక్ ఇచ్చిన డైలాగ్ అభిమానుల్ని ఆహ్లాదపరిచింది. ఈసారి హృతిక్ పాత్ర కబీర్ మరింత క్రూరంగా, శక్తివంతంగా కనిపిస్తుండటంతో టీజర్ యాక్షన్ హైప్‌కు కారణమైంది.

ఎన్టీఆర్ విలన్‌గా.. హృతిక్‌కు తగిన సవాల్!
వార్ 2లో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. గతంలో ‘వార్’ (2019)లో హృతిక్ నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సక్సెస్‌ను కొనసాగించేందుకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 రూపుదిద్దుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

టీజర్‌లో హృతిక్ రోషన్ పవర్ఫుల్ యాక్షన్, కత్తి పోరాటాలు, కార్ చేజ్ లాంటి భారీ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. అతని గెటప్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. ఎన్టీఆర్‌తో తలపడే హృతిక్ న్యూ వెర్షన్ థ్రిల్ కలిగించేలా ఉంది.

Read This also…JSW MG Motor India Strengthens EV Portfolio with the Launch of MG Windsor Exclusive PRO Variant

2025 ఆగస్టు 14న విడుదల
యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ధూమ్ 2’, ‘అగ్నిపథ్’, ‘వార్’, ‘విక్రమ్ వేద’, ‘ఫైటర్’ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన హృతిక్.. ఇప్పుడు వార్ 2తో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు.