365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, మే 25, 2025 : చైనా టెక్ దిగ్గజం Xiaomi తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 15S Proను చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ హ్యాండ్ సెట్ కంపెనీ నుంచి ఇన్-హౌస్ అభివృద్ధి చేసిన 3nm 10-కోర్ XRING 01 చిప్సెట్ తో విడుదలైన మొట్టమొదటి ఫోన్‌గా రికార్డు సృష్టించింది.
ఈ ఫోన్లో HyperOS 2.0 (Android 15 ఆధారిత) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించారు. స్టోరేజ్ విభాగంలో ఇది 16GB వరకు LPDDR5X RAM , 1TB వరకు UFS 4.0 స్టోరేజ్ తో లభిస్తోంది.
ఫోటోగ్రఫీ విభాగంలో లైకా-బ్యాక్డ్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణ. ఇందులో 50MP ప్రైమరీ లైట్ ఫ్యూజన్ 900 సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ Samsung S5KJN1 లెన్స్ అండ్ 50MP సోనీ IMX858 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఇది 5x ఆప్టికల్ జూమ్, 10x ఇన్-సెన్సార్ లాస్‌లెస్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్
ఇది కూడా చదవండి…చెరువును కాపాడిన..హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆత్మీయ సత్కారం..
ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, Xiaomi 15S Proలో 6100mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 90W వైర్డు, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని అందించారు.
కనెక్టివిటీ ఎంపికల్లో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS/NavIC, USB Type-C 3.2 Gen1, NFC వంటివి ఉన్నాయి. ఫోన్ IP68 రేటింగ్ తో దుమ్ము, నీటి నిరోధకత కలిగినట్టుగా రూపొందించారు.
డిస్ప్లే విషయానికి వస్తే, 6.73-అంగుళాల 2K OLED LTPO స్క్రీన్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 nits పీక్ బ్రైట్నెస్, 1,920Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిరామిక్ గ్లాస్ 2.0 ప్రొటెక్షన్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంటాయి.

ధర,లభ్యత..?
16GB+512GB వేరియంట్: CNY 5,499 (సుమారు రూ.65,500)
16GB+1TB వేరియంట్: CNY 5,999 (సుమారు రూ.71,500)
ఫోన్ రెండు ఆకర్షణీయ ఫినిష్‌లలో లభిస్తుంది: డ్రాగన్ స్కేల్ ఫైబర్ వెర్షన్, ఫార్ స్కై బ్లూ ఫినిష్. చైనాలో కంపెనీ అధికారిక ఇ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది.