365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 7,2025: ప్రకృతి పరిరక్షణ, వన సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ, పూర్తి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో రూపొందిన అరుదైన చిత్రం “కలివి వనం”. ఈ చిత్ర టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో మీడియా మిత్రుల చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.
ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నాగదుర్గ ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతోంది.
టీజర్ విడుదల కార్యక్రమంలో టీ.ఎఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యూరీ మెంబర్ లక్ష్మీ నారాయణ, సినీజోష్ సీఈఓ రాంబాబు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, దుష్చర్ల సత్యనారాయణ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుష్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, “పంచభూతాల్లాగే చెట్టు కూడా ప్రకృతి మాత. వనాలు బాగుంటేనే జనాలు బాగుంటారు. అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం అన్యాయం. ‘కలివి వనం’ చిత్రంతో పర్యావరణం గురించి మంచి సందేశం ఇచ్చారు. ఈ సినిమా పర్యావరణ రక్షణ గురించి మన ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి,” అని ఆకాంక్షించారు.
సంగీత దర్శకుడు మదీన్ ఎస్.కె మాట్లాడుతూ, “నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ అన్నకు, నిర్మాతలు మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డిలకు ధన్యవాదాలు. నేను కంపోజ్ చేసిన టీజర్ నా పనితీరును చెబుతుందని భావిస్తున్నా. మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేశాను,” అని తెలిపారు.
నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ, “‘కలివి వనం’ సామాజిక స్పృహతో చేసిన సినిమా. ‘బలగం’ చిత్రంతో నాకు ఎంత పేరొచ్చిందో, ఈ చిత్రానికి కూడా అలాంటి గుర్తింపే వస్తుందని ఆశిస్తున్నా. అడవుల్లో, గుట్టల్లో షూటింగ్ చేయడం మంచి అనుభవం. ప్రకృతి కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి,” అని కోరారు.
నటుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ, “ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన పర్యావరణాన్ని కాపాడుకుందామనే మంచి కాన్సెప్ట్‌తో రాజ్ గారు ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నేనొక ముఖ్యమైన పాత్ర పోషించాను. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు అవార్డ్స్ కూడా రావాలి,” అని అన్నారు.
లిరిక్ రైటర్ తిరుపతి మాట్ల మాట్లాడుతూ, “రాజ్ అన్న యూట్యూబ్ ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ‘కలివి వనం’ సినిమాతో ప్రకృతి గురించి బిగ్ స్క్రీన్ మీద తన విజన్‌ను చూపించబోతున్నారు. ఈ చిత్రంలో మంచి సాహిత్యాన్ని అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉంది,” అని చెప్పారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ మాట్లాడుతూ, “ప్రకృతిని కాపాడుకోవాలనే కాన్సెప్ట్‌తో రాజ్ నరేంద్ర ‘కలివి వనం’ చిత్రాన్ని చేయడం అభినందనీయం. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా,” అని తెలిపారు.

నటుడు ఖయ్యూం మాట్లాడుతూ, “డైరెక్టర్ రాజ్ నరేంద్ర మొదటి హీరోను నేనే. 12 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాం. ‘కలివి వనం’ లాంటి ఆర్గానిక్ సినిమాను రూపొందించడం రాజ్ కే సాధ్యం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా,” అని అన్నారు.
నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, “దర్శకుడు రాజ్ లాగే నాకు కూడా చెట్లంటే ఇష్టం. అందుకే ‘కలివి వనం’ సినిమాను రూపొందించాను. ఒక చిన్న ఐడియాగా మొదలైన ఈ మూవీ ఈ రోజు ఇంత బాగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది,” అని పేర్కొన్నారు.
నిర్మాత విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ, “మా సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. వారి సపోర్ట్‌తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా టీమ్ తరపున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు,” అని తెలిపారు.
నటి నాగ దుర్గ మాట్లాడుతూ, “పర్యావరణం బాగుండాలని చెప్పే మంచి సందేశమున్న సినిమా ‘కలివి వనం’. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. దర్శక నిర్మాతల వల్లే ఈ సినిమా సాధ్యమైంది,” అని అన్నారు.
నటి బలగం విజయలక్ష్మి మాట్లాడుతూ, “వనాలను కాపాడుకోవాలి, జనాలను రక్షించుకోవాలనే కాన్సెప్ట్‌తో రాజ్ నరేంద్ర గారు ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించి చెట్లను కాపాడాలని కోరుతున్నా,” అని విజ్ఞప్తి చేశారు.

దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ, “‘కలివి వనం’ కేవలం కమర్షియల్ చిత్రం కాదు, పిల్లల నుంచి పెద్దల దాకా చూడాల్సిన సినిమా. చెట్ల విలువను చిన్నప్పటి నుంచే పిల్లలు తెలుసుకోవాలి. ప్రేక్షకుల మనసులను తాకే చిత్రమిది. వనజీవి రామయ్య, దుష్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించాను,” అని వెల్లడించారు.
Read This also…Get Ready for the Ultimate Knockout: Blockbuster Malayalam Film “Alappuzha Gymkhana” Premieres June 13, Only on Sony LIV
ఇది కూడా చదవండి…మహిళా ఎస్సైపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..
నటీనటులు: రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, నాగ దుర్గ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఏఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి
రచనా దర్శకత్వం: రాజ్ నరేంద్ర
సినిమాటోగ్రాఫర్: జియల్ బాబు
సంగీతం: మదీన్ ఎస్.కె
ఎడిటర్: చంద్రమౌళి
మాటలు: కోటగల్లి కిషోర్
పాటలు: కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల, కమల్ ఇస్లావత్
పీఆర్ఓ: శ్రీధర్ (స్టూడియో వన్)..