365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 8, 2025: బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ ఓటీటీ డెబ్యూ సిరీస్, ‘దేవిక & డానీ’ జియో హాట్ స్టార్‌లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి. కిషోర్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో సూర్య వశిష్ఠ, శివ కందుకూరి హీరోలుగా నటించగా, సురేష్ ఎర్ర సహా నిర్మాతగా వ్యవహరించారు.

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రీతూ వర్మ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. అందంగా కనిపించడమే కాకుండా, టీచర్‌గా ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయిగా అద్భుతంగా నటించింది. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండగా, శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి పాత్రకు చక్కగా సెట్ అయ్యాడు.

నటులు సుబ్బరాజు పల్లెటూరి క్యారెక్టర్‌లో కొత్తగా కనిపించి మెప్పించారు. చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిపించి తమ మార్కు చూపించారు. సిరీస్‌కు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అద్దింది.

Read This also…Get Ready for the Ultimate Knockout: Blockbuster Malayalam Film “Alappuzha Gymkhana” Premieres June 13, Only on Sony LIV

ఇది కూడా చదవండి…మహిళా ఎస్సైపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..

దర్శకుడు కిషోర్.బి ఈ సిరీస్‌ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విజయం సాధించారు. మంచి రివ్యూలు, రేటింగ్‌లతో పాజిటివ్ టాక్‌తో ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘దేవిక & డానీ’ సిరీస్‌ను కుటుంబమంతా కలిసి చూసి ఆనందించవచ్చు..!