365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 15, 2025 :డబ్బుంటేనే లోకం, డబ్బుంటేనే స్నేహం,డబ్బుంటేనే బంధం, డబ్బుంటేనే సాన్నిహిత్యం. డబ్బున్నవాడికి పది పలకరింపులు,డబ్బులేనివాడికి పలకరిస్తేనే బరువైన అడుగులు.
డబ్బున్నవాడికి అందరూ చుట్టాలే,
పనికల్పించుకొని పలకరిస్తారు, పలకరించి పోతారు.
డబ్బు లేనివాడికి దూరం నుంచే ఎటకారంగా దండం పెడతారు. కనిపించకపోతే అదే మహా భాగ్యం.
ఇది కూడా చదవండి..ఫాదర్స్ డే 2025: 60 ఏళ్లు పైబడిన నాన్నకు ఆరోగ్యం బహుమతిగా ఇవ్వండి..
Read This also…Monsoon Regatta 2025: Windless Day 5 Keeps Leaderboard Unchanged
డబ్బుతో కొలిచే ఈ బంధాలెందుకు?
డబ్బులేని ప్రేమ, అనురాగం ఎటు పోయెను?
కష్టకాలంలో తోడుండేవాడే నిజమైన బంధువు,
డబ్బుతో కొలిచే బంధాలు నిస్సారమైనవి.

డబ్బు శాశ్వతం కాదు, బంధమే ముఖ్యం,
మనసులో మమతలే అసలైన ఐశ్వర్యం.
ఈ లోకంలో డబ్బుతో కొలవలేనివి ఎన్నో,
అదే మానవ సంబంధాల గొప్పతనం, అదే జీవన సారం.-పసుపులేటి శ్రీలక్ష్మి, జర్నలిస్ట్