365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 16, 2025 : కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి, ఒక్కో రకం ఒక్కో విధంగా మనకు ఉపయోగ పడు తుంది. పచ్చ కర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు, వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కాటుక, అంజనం తయారీకి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్పెన్టైన్ నుండి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు, కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగిస్తారు.
రస కర్పూరం: చిన్న పిల్లలకు ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దీనిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం వంటి అనేక రకాల కర్పూరాలు ఉన్నాయి.