365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 10, 2025: మెదడులోని కణుతు లు, ఇతర ఇంట్రాక్రేనియల్ సమస్యలకు అత్యంత కచ్చితత్వం, భద్రతతో కూడిన నాన్-ఇన్వాసివ్ చికిత్స అందించడంలో ఒక విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ, హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ZAP-X® గైరోస్కోపిక్ రేడియోసర్జరీ® విభాగాన్ని ప్రారంభించింది.

ఈ అధునాతన పరికరం 2025 చివరి నాటికి గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్స్ ప్రధాన కార్యాలయంలో అందుబాటులోకి రానుంది.

సాంప్రదాయకంగా, స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (SRS) అనేది మెదడు శస్త్రచికిత్సకు నిరూపితమైన, నాన్-ఇన్వాసివ్ ఔట్‌పేషెంట్ ప్రత్యామ్నాయం. కోతలు, అనస్థీషియా లేదా దీర్ఘకాలిక రికవరీ సమయాలు లేకుండా శస్త్రచికిత్సలో ఖచ్చితత్వాన్ని అందిస్తుంది ఈ SRS.

ZAP-X సిస్టమ్‌ను సైబర్‌నైఫ్® సృష్టికర్త, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మాజీ న్యూరోసర్జన్ అయిన డాక్టర్ జాన్ ఆర్. అడ్లర్ అభివృద్ధి చేశారు. ZAP-X సిస్టమ్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాల్ట్-రహిత రేడియోసర్జరీ విభాగం కావడం విశేషం. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, ZAP-X సిస్టమ్ రేడియోధార్మిక కోబాల్ట్-60 పై ఆధారపడదు.

అంతేకాకుండా, దీనిని ఖరీదైన రేడియేషన్-షీల్డెడ్ గదులు లేకుండానే వ్యవస్థాపించ వచ్చు. దీనికి బదులుగా, ZAP-X సిస్టమ్ ఆధునిక లీనియర్ యాక్సిలరేటర్‌ను ఉపయోగిస్తుంది. ఇది నిలకడగా రేడియేషన్ మోతాదులను అందిస్తుంది, తద్వారా నిర్వహణ ఖర్చులు, రేడియేషన్ ఎక్స్‌పోజర్ గణనీయంగా తగ్గుతాయి.

“AIG లో, భారతదేశానికి అత్యంత అధునాతన, రోగుల అవసరాలు, సౌకర్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సాంకేతికతలను తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని AIG హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి అన్నారు.

“ZAP-X తో, AIG హాస్పిటల్స్ ఈ అధునాతన చికిత్సను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రపంచ స్థాయి న్యూరోసర్జికల్ కేర్ కోసం రోగులు విదేశాలకు వెళ్లవలసిన అవసరం తగ్గుతుంది” అని కూడా డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి అన్నారు.

ZAP-X గైరోస్కోపిక్, డ్యూయల్-గింబల్డ్ ఆకారం పూర్తి 360-డిగ్రీల చికిత్సా వర్క్‌స్పేస్‌ను అందిస్తుంది. ఇది సబ్-మిల్లిమీటర్ టార్గెటింగ్ ఖచ్చితత్వాన్ని, రియల్-టైమ్ ఇమేజింగ్‌ను సాధ్యం చేస్తుంది.

ఇది అత్యంత కచ్చితమైన రేడియేషన్‌ను అందిస్తుంది, తద్వారా మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది. ఇది మెదడు మెటాస్టాసిస్ (మెదడుకు పాకిన క్యాన్సర్), మెనింగియోమాస్, అకౌస్టిక్ న్యూరోమాస్, AVMలు (ఆర్టిరియోవెనస్ మాల్ఫార్మేషన్స్) ట్రైజెమినల్ న్యూరల్జియా వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి అనువైనదిగా చేస్తుంది.

“ఇది కేవలం ఒక సాంకేతిక అప్‌గ్రేడ్ కాదు – ఇది ఒక నమూనా మార్పు” అని న్యూరోసర్జరీ డైరెక్టర్ & HOD డాక్టర్ సుబోధ్ రాజు అన్నారు. “ఎటువంటి నొప్పి లేకుండా, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేకుండా రోగులు చికిత్స పొందిన వెంటనే వెళ్ళిపోవచ్చు” అని కూడా డాక్టర్ సుబోధ్ రాజు అన్నారు.

నాన్-ఇన్వాసివ్ ఇమ్మొబిలైజేషన్ (శరీరాన్ని కదలకుండా స్థిరీకరించడం), పునరావృత చికిత్సలు మరియు రియల్-టైమ్ డోస్ పర్యవేక్షణకు కూడా ఈ చికిత్సా విధానం అనుమతిస్తుంది. ఇది రోగి సౌకర్యాన్ని, చికిత్స భద్రతను మెరుగుపరుస్తుంది.

భారతదేశం, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం ఆఫ్రికా అంతటా సంక్లిష్ట న్యూరోసర్జికల్ కేర్ కోసం క్వాటర్నరీ రెఫరల్ సెంటర్‌గా మారాలనే AIG ఆసుపత్రి దార్శనికతకు అనుగుణంగా ఉంది ఈ అత్యాధునిక చికిత్సా ఏర్పాటు అని AIG హాస్పిటల్స్ వైస్-ఛైర్మన్ పి.వి.ఎస్. రాజు అన్నారు.

ZAP-X తో, AIG హాస్పిటల్స్ అధునాతన న్యూరోసైన్స్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెదడులోని కణుతుల చికిత్సను పునర్నిర్వచిస్తున్న ప్రపంచంలోని అగ్రగామి వైద్య సంస్థల జాబితాలో AIG హాస్పిటల్స్ నిలిచింది.