365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగుళూరు, జూలై, 2025: అమెజాన్ ఇండియా నిర్వహించిన ప్రైమ్ డే 2025 భారతదేశంలోనే అత్యధికంగా షాపింగ్ జరిగిన ప్రైమ్ డే ఈవెంట్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ మూడు రోజుల ఈవెంట్లో మునుపటి ప్రైమ్ డేలన్నింటినీ అధిగమించి రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. ప్రైమ్ సభ్యులు ఒక్క నిమిషంలో 18,000లకు పైగా ఆర్డర్లు (2024తో పోలిస్తే 50% ఎక్కువ) చేసి సరికొత్త మైలురాయిని అందుకున్నారు.
మెయిన్ హైలైట్స్..
దేశవ్యాప్త వృద్ధి: ప్రైమ్ డే ముందు నమోదైన కొత్త ప్రైమ్ సభ్యత్వాలలో 70% టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల నుండే రావడం గమనార్హం.
వేగవంతమైన డెలివరీలు: మెట్రో నగరాల్లో లక్షలాది ఉత్పత్తులు 4 గంటలలోపు డెలివరీ అయ్యాయి. టైర్ 2 & 3 నగరాల్లో కూడా అదే రోజు/తరువాతి రోజు డెలివరీలు గణనీయంగా పెరిగాయి.
విక్రేతలకు భారీ విజయం: ఈసారి ప్రైమ్ డేలో అత్యధిక సంఖ్యలో విక్రేతలు, ముఖ్యంగా చిన్న,మధ్య తరహా వ్యాపారాలు (SMBలు) పాల్గొని, గొప్ప అమ్మకాలను సాధించారు. 68% పైగా SMBలు టైర్ 2 & 3 నగరాలకు చెందినవే.
అమెజాన్ పే వినియోగం: ఎక్కువ మంది ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ద్వారా షాపింగ్ చేశారు. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు, అమెజాన్ పే లేటర్ సేవలను 50% పైగా కస్టమర్లు ఉపయోగించుకున్నారు.

వినోదం: ప్రైమ్ వీడియో ‘పంచాయత్ సీజన్ 4’, ‘ద ట్రెయిటర్స్’ వంటి 17 కొత్త భారతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌ను విడుదల చేసింది. ఈ కంటెంట్ 224 దేశాల్లో స్ట్రీమ్ అయింది, భారతీయ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది.
అమెజాన్ బిజినెస్ వృద్ధి: వ్యాపార కస్టమర్ల సైన్-అప్లు 3 రెట్లు, ‘పెయిడ్ ప్రైమ్ సైన్-అప్స్’ 7 రెట్లు పెరిగాయి. టెలివిజన్లు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, టాబ్లెట్లు వంటి విభాగాల్లో భారీ వృద్ధి నమోదైంది.
అక్షయ్ సాహీ, అమెజాన్ ప్రైమ్ హెడ్, భారతదేశం, మాట్లాడుతూ “భారతదేశంలో అతి పెద్ద ప్రైమ్ డేను నిర్వహించేందుకు సహకరించిన విక్రేతలకు, బ్రాండ్లకు, బ్యాంక్ భాగస్వాములకు ధన్యవాదాలు.
ప్రైమ్ సభ్యులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారు. మా అసోసియేట్ల సంక్షేమం కోసం పెట్టిన రూ. 2000 కోట్ల పెట్టుబడి వల్ల ఈ ఏడాది మరింత వేగంగా, సురక్షితంగా డెలివరీ చేయగలిగాము” అని పేర్కొన్నారు.