365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 12,2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. పద్మశ్రీ ఎస్సార్ రంగనాథన్ 133వ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం జరుపుకున్న ఈ కార్యక్రమంలో విశేష ఘనతను చాటి చెప్పారు.
Read This also…Panasonic Launches LUMIX S1II & S1IIE in India to Empower Creators with Pro-Level Photo and Video Capabilities..
ఈ సందర్భంగా యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ వివేకవర్ధన్ జాతీయ గ్రంథపాలకుల దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. అలాగే, నాలెడ్జ్ మేనేజ్మెంట్ ద్వారా విద్యార్థులకు అందుతున్న వివిధ సేవలను వివరించి, యూనివర్సిటీ లైబ్రరీ సేవల పై విద్యార్థులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

డిజిటల్ మాధ్యమాల అభివృద్ధితో కూడిన సమకాలీన కాలంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత తక్కువ కాలేదు అని యూనివర్సిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ ఝాన్సీ అన్నారు. విద్యార్థులు గ్రంథాలయ సేవలను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు డాక్టర్ బలరాం, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ ఈశ్వరి, డాక్టర్ శశికళ, విద్యార్థులు, లైబ్రరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే, అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ సైన్స్ డాక్టర్ ఎన్ పి రవికుమార్ వందన సమర్పణ చేశారు.