365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 25, 2025: వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ ఆన్ టూర్,హైదరాబాదు సూపర్‌స్టార్స్ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాదు ఓపెన్ 2025 విజయవంతంగా ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీలో 250 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు.
మొత్తం రూ.15 లక్షల బహుమతి నిధితో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కుల్దీప్ మహాజన్, అనుజా మహేశ్వరి, వంశిక్ కపాడియా, వృషాలి ఠాకరే ప్రొఫెషనల్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చారు.
చివరి రోజు జరిగిన 8 ఫైనల్ మ్యాచ్‌లలో:
- ప్రో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాదు సూపర్‌స్టార్స్ ఆటగాడు కుల్దీప్ మహాజన్, స్థానిక ఆటగాడు సమీర్ వర్మపై వరుస రెండు సెట్లలో విజయం సాధించి కైవసం చేసుకున్నాడు.
- ప్రో మహిళల సింగిల్స్లో అనుజా మహేశ్వరి వృషాలి ఠాకరేను ఓడించి గెలిచింది.
- అయితే ప్రో మహిళల డబుల్స్లో ఇషా లఖానీతో జతకట్టిన వృషాలి, అనుజాపై విజయం సాధించింది.
- ప్రో మిక్స్డ్ డబుల్స్లో వృషాలి, వంశిక్ కపాడియాతో కలిసి మరో విజయాన్ని నమోదు చేసింది.
- ప్రో పురుషుల డబుల్స్లో వంశిక్ కపాడియా, తేజస్ మహాజన్ జోడీ, సోను విశ్వకర్మ – రితమ్ చావ్లా జట్టును మూడు సెట్లలో ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.

కేఎల్ఓ స్పోర్ట్స్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ మద్దతుతో ముందుకు సాగుతున్న హైదరాబాదు సూపర్‌స్టార్స్, వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో రెండో సీజన్ ఆడుతున్న ప్రముఖ ఫ్రాంచైజీలలో ఒకటి. సీజన్ 1లో సెమీ ఫైనల్స్ వరకు చేరిన ఈ జట్టు, హైదరాబాద్‌లో పికిల్‌బాల్ సంస్కృతిని విస్తరించి, ఆటగాళ్లకు ఈ క్రీడను సీరియస్ కెరీర్‌గా ఆలోచించే అవకాశం కల్పించింది.
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ మాట్లాడుతూ –“హైదరాబాదు ఓపెన్‌లో నగరంలోని పికిల్‌బాల్ కమ్యూనిటీ మొత్తం భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్‌లో 500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొనేలా చేస్తామని ఆశిస్తున్నాము. ఇకపై మన దృష్టి వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ సీజన్ 2పై ఉంటుంది.” అని తెలిపారు.
Read This also…Hyderabad Open 2025: Kuldip Mahajan, Anuja Maheshwari, Vanshik Kapadia & Vrushali Thakare Shine in Grand Finale..
శ్రీనాథ్ చిట్టూరి, సహయజమాని (హైదరాబాదు సూపర్‌స్టార్స్, KLO స్పోర్ట్స్) మాట్లాడుతూ –“హైదరాబాద్కు పికిల్‌బాల్ తీసుకురావడం మా ప్రధాన ఉద్దేశ్యం. మాకు లభించిన అద్భుతమైన కమ్యూనిటీ మద్దతు, ఈ టోర్నమెంట్ విజయానికి నిదర్శనం. ఇది ఆటగాళ్ల నిబద్ధతకు గొప్ప ఉదాహరణ” అని అన్నారు.