365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అహ్మదాబాద్, ఆగస్టు 26, 2025: సెల్‌విన్ ట్రేడర్స్ లిమిటెడ్ (BSE: 538875) అమెరికాకు చెందిన శివమ్ కాంట్రాక్టింగ్ ఇన్‌క్ (SCI)తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద, కంపెనీ SCI ప్రాజెక్టులలో భాగస్వామ్యం కోసం 6 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు ₹52 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టనుంది.

MOU ప్రకారం, సెల్‌విన్ ట్రేడర్స్ SCIలో 60% వరకు ఈక్విటీ వాటా పొందే అవకాశం ఉంది. షేర్ల జారీ ద్వారా కొనుగోలు జరుగుతుంది, ప్రతి షేర్ ధర కనీసం ₹18 కంటే తక్కువ కాకూడదు. ఈ ఒప్పందం 12 నెలలపాటు చెల్లుబాటులో ఉంటుంది. SCI రెండు సంవత్సరాలలోపు పెట్టుబడులను తిరిగి భారత్‌కి రప్పించడంతో పాటు, సంవత్సరానికి కనీసం 7% హామీ ఇచ్చిన రాబడిని అందించనుంది.

ప్రారంభ దశలో కంపెనీ USD 3 మిలియన్ (₹26 కోట్లు) పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితమైన ఒప్పందానికి RBI, SEBI, BSE, FEMA, MCAతో పాటు అమెరికా నియంత్రణ సంస్థల అనుమతులు అవసరం.

ఈ సందర్భంగా సెల్‌విన్ ట్రేడర్స్ డైరెక్టర్ మోనిల్ వోరా మాట్లాడుతూ:
“శివమ్ కాంట్రాక్టింగ్‌తో ఈక్విటీ పెట్టుబడి మాకు అమెరికా మౌలిక సదుపాయ రంగంలో బలమైన స్థానం కలిగిస్తుంది. అలాగే దుబాయ్‌లోని GMIITలో నియంత్రణ సముపార్జనతో గల్ఫ్‌ ఐటీ రంగంలో కూడా విస్తరిస్తున్నాం. బలమైన Q1 ఫలితాలతో మేము వేగవంతమైన విలువ సృష్టికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.

దుబాయ్‌లో IT విస్తరణ:
ఆగస్టు 21న, కంపెనీ గ్లోబల్ మార్కెట్ ఇన్‌సైట్స్ ఐటీ సర్వీసెస్ (GMIIT), దుబాయ్తో కూడా MOU కుదుర్చుకుంది. 51% పైగా ఈక్విటీ వాటాను USD 1 మిలియన్‌కు కొనుగోలు చేసి దానిని అనుబంధ సంస్థగా మార్చనుంది. ఈ భాగస్వామ్యం గల్ఫ్ ప్రాంతంలో AI, బ్లాక్‌చెయిన్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి సేవల విస్తరణపై దృష్టి సారించనుంది.

Read This also…Sellwin to Invest $6M in U.S. Firm Shivam Contracting..

బలమైన ఆర్థిక ఫలితాలు:
Q1FY26 (జూన్ 2025)లో కంపెనీ ₹3.14 కోట్లు నికర లాభం సాధించింది – గతేడాది ఇదే కాలం లోని ₹70 లక్షలతో పోలిస్తే 350% పెరుగుదల. ఆదాయం ₹21.85 కోట్లు, గత సంవత్సరం Q1లోని ₹16.63 కోట్లతో పోలిస్తే 31.4% అధికం.
FY24-25లో కంపెనీ నికర లాభం ₹2.79 కోట్లు, ఆదాయం ₹74.28 కోట్లు సాధించింది.

జూలై 31న జరిగిన బోర్డు సమావేశంలో, విస్తరణ ప్రణాళికలకు నిధులు సమకూర్చడానికి ₹8.40 ధరకు గరిష్టంగా 4.75 కోట్లు వారెంట్లను జారీ చేయాలని నిర్ణయించింది.