365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 8,2025: హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ డిజైన్, తయారీ, సరఫరాలో నిమగ్నమైన హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ (Hy-Tech Engineers Limited) తమ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ *సెబీ (SEBI)*కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమర్పించింది.
ఈ ఐపీవోలో భాగంగా రూ.70 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద మొత్తం 1,19,33,120 షేర్లు విక్రయించనున్నారు. ఇందులో భాగంగా ప్రమోటర్ షేర్‌హోల్డర్లలో హేమంత్ తుకారాం మోండ్కర్ 75 లక్షల షేర్లు, సురేఖ హేమంత్ మోండ్కర్ 44,33,120 షేర్లను విక్రయించనున్నారు.
ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ ప్రధానంగా క్రింది ప్రయోజనాల కోసం వినియోగించుకోనుంది:
- కవాథే, షిర్వాల్ యూనిట్ల విస్తరణకు, పిథంపూర్ యూనిట్-1లో మెషినరీ మరియు ఎక్విప్‌మెంట్ కొనుగోలు కోసం సుమారు రూ.31.98 కోట్లు.
- సుమారు రూ.18 కోట్లు రుణాల తీర్చివేత/ప్రి-పేమెంట్ కోసం.
- మిగతా నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం.

వ్యవసాయం, నిర్మాణం, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో అధునాతన యంత్రాల వినియోగం పెరుగుతున్నందున, హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో వేగంగా వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి.
Read This also…Hy-Tech Engineers Limited Files DRHP with SEBI for Rs.70 Crore IPO..
2019 నుంచి 2024 మధ్య ఈ మార్కెట్ వార్షికంగా 7.7% వృద్ధి సాధించగా, 2024 నుంచి 2030 మధ్య కాలంలో అది 10.4% CAGRతో విస్తరించనుందని CareEdge Research (సెప్టెంబర్ 2025) అంచనా వేసింది.
ఈ ఇష్యూకి న్యూ బెర్రీ క్యాపిటల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.