365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్10 2025: మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి, నటి లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లావణ్య పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వరుణ్ తేజ్, లావణ్య దంపతులతో పాటు మెగా అభిమానులంతా ఆనందంలో మునిగిపోయారు.
https://www.instagram.com/p/DOawZVlkaxI
షూటింగ్ నుంచి డైరెక్ట్ గా ఆస్పత్రికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి..
వరుణ్, లావణ్య దంపతులకు బాబు పుట్టిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఆస్పత్రికి వెళ్లారు. బిడ్డను, లావణ్యను చూసి, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పడంతో చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. మెగా కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లి కొత్త తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
వరుణ్, లావణ్యల ప్రేమ ప్రయాణం..

‘మిస్టర్’, ‘అంతరిక్షం’ వంటి చిత్రాలలో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కొద్ది కాలం పాటు ప్రేమాయణం నడిపి, గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు.
Read This also…ideaForge’s Q6 V2 UAV Platform Secures NATO Stock Number, Unlocking Global Defense Procurement..
అనంతరం ఘనంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు వారి ప్రేమకు గుర్తుగా ఈ బుజ్జి బాబు వారి జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభవార్తతో సోషల్ మీడియాలో అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.