365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 23,2025 : ఆల్ ఇండియా ఆఫ్థల్మాలజికల్ సొసైటీ (AIOS) గౌరవ కార్యదర్శి, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సైట్ ఐ హాస్పిటల్‌లో డైరెక్టర్, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ మాజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ జి. హొనవర్ అరుదైన గౌరవం సాధించారు.

స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ మరియు ఎల్సివియర్ నిపుణులు విడుదల చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం నుండి అగ్రశ్రేణి ఆఫ్థల్మాలజీ పరిశోధకుడిగా నిలిచారు.

కెరీర్-లాంగ్ ఇంపాక్ట్‌లో నెంబర్ వన్

డాక్టర్ హొనవర్ వరుసగా ఐదో సారి వార్షిక ప్రభావం (Annual Impact) జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నారు. అంతేకాకుండా, మొదటిసారిగా కెరీర్-లాంగ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారతదేశం నుంచి అగ్రస్థానం సాధించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 2% పరిశోధకులను వారి జీవితకాలం మరియు 2024 సంవత్సరంలో చేసిన కృషి ఆధారంగా ఈ జాబితాలో చేర్చారు.

అంతర్జాతీయ ఖ్యాతిగడించిన నేత్ర వైద్య నిపుణుడు

కంటి క్యాన్సర్లలో నిపుణుడైన డాక్టర్ హొనవర్ తన కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్థల్మాలజీ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వీటిలో ముఖ్యమైనవి.

యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆఫ్థల్మాలజిస్ట్స్ నుండి గౌరవ ఫెలోషిప్ పొందిన ఏకైక భారతీయుడు కూడా ఆయనే. ఆయన పరిశోధనలకు 17,000 పైగా సైటేషన్స్ ఉన్నాయి.

AIOS ప్రశంసలు..

AIOS అధ్యక్షుడు డాక్టర్ పార్థ బిశ్వాస్ మాట్లాడుతూ, స్టాన్‌ఫర్డ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారత పరిశోధకులను అభినందించారు.

ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ (IJO) వంటి వేదికల ద్వారా భారత పరిశోధనను ప్రోత్సహించడం AIOS విజన్ 2030లో ఒక భాగమని ఆయన అన్నారు.

భారత నేత్ర వైద్య రంగం ప్రపంచవ్యాప్తంగా విశేష స్థానాన్ని సంపాదించడం, మన పరిశోధకుల కృషిని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.

టాప్ 2% జాబితాలో భారతీయ వైద్యులు..

కెరీర్-లాంగ్ ఇంపాక్ట్ జాబితాలో 27 మంది భారతీయ నేత్ర వైద్యులు ఉండగా, 2024 సంవత్సరపు ఇంపాక్ట్ జాబితాలో 61 మందికి చోటు దక్కింది. వీరిలో 17 మంది ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, 12 మంది ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఇతర ప్రముఖ సంస్థల నుండి ఉన్నారు.

టాప్ 10 భారతీయ నేత్ర వైద్యులు (కెరీర్-లాంగ్ ఇంపాక్ట్)..

సంతోష్ జి. హొనవర్

గుల్లపల్లి ఎన్. రావు

ఫిలిప్ అలోయ్సియస్ థామస్

వీరేందర్ ఎస్. సంగ్వాన్

సావిత్రి శర్మ

ముత్తయ్య కె. శ్రీనివాసన్

డి. బాలసుబ్రహ్మణ్యన్

అమోద్ గుప్తా

జి.వి.ఎస్. మూర్తి

మొహమ్మద్ జావేద్ అలీ

టాప్ 10 భారతీయ నేత్ర వైద్యులు (2025 ఇంపాక్ట్)

సంతోష్ జి. హొనవర్

మొహమ్మద్ జావేద్ అలీ

స్వాతి కలికి

జి.వి.ఎస్. మూర్తి

సావిత్రి శర్మ

నమ్రతా శర్మ

వినోద్ కుమార్

ఫిలిప్ అలోయ్సియస్ థామస్

వీరేందర్ ఎస్. సంగ్వాన్

డా. ప్రకాశ్ గార్గ్..