365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30,2025 : రక్తదానం చేయడం అనేది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. ప్రతి దాతకు కేవలం ఒక్కసారి మాత్రమే స్టెరైల్ సూదిని (Sterile Needle) ఉపయోగిస్తారు, ఆ తర్వాత దాన్ని వెంటనే పారవేస్తారు. కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండదు.
కేవలం నాలుగు దశల్లో పూర్తి..
రక్తదానం అనేది కేవలం నాలుగు సాధారణ దశలతో కూడిన ప్రక్రియ.
నమోదు (Registration): దాత వివరాలను నమోదు చేయడం.
వైద్య పరీక్ష (Medical History & Mini-physical): దాత వైద్య చరిత్రను పరిశీలించి, చిన్నపాటి శారీరక పరీక్ష చేస్తారు.
రక్తదానం (Donation): రక్తదాన ప్రక్రియ..
పానీయాలు (Refreshments): రక్తదానం తర్వాత శక్తి కోసం పానీయాలు తీసుకోవడం.
దాతకు భద్రత..
ప్రతి రక్తదాతకు రక్తదానానికి ముందు చిన్నపాటి శారీరక పరీక్ష (Mini-physical) నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో దాత శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, పల్స్ మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పరిశీలిస్తారు.
దాత ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే రక్తం తీసుకోవడం జరుగుతుంది.
ఎంత సమయం పడుతుంది..?
రక్తం ఇచ్చే ప్రక్రియ (Actual blood donation) కేవలం 10 నుంచి 12 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.
దాత వచ్చిన సమయం నుంచి బయటకు వెళ్లే వరకు మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఒక గంట పదిహేను నిమిషాలు (1 గంట 15 నిమిషాలు) పడుతుంది.
ఎంత రక్తం ఇస్తారు..?
సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరంలో సుమారు 10 యూనిట్ల రక్తం ఉంటుంది.
దాత నుంచి ఇచ్చే రక్తదానం కేవలం 1 యూనిట్ మాత్రమే.
తిరిగి ఎప్పుడు దానం చేయవచ్చు..?
ఒక ఆరోగ్యవంతమైన దాత ప్రతి 56 రోజులకు ఒకసారి ఎర్ర రక్త కణాలు (Red Blood Cells) దానం చేయవచ్చు.
ప్లేట్‌లెట్స్‌ను (Platelets) అయితే ఏడు రోజుల వ్యవధిలో కూడా దానం చేయవచ్చు. అయితే, సంవత్సరంలో గరిష్టంగా 24 సార్లు మాత్రమే దానం చేయడానికి అనుమతి ఉంది.
రక్తం నాణ్యత(Blood quality)..

దానం చేసిన రక్తాన్ని రోగులకు ఎక్కించే ముందు, ఆ రక్తాన్ని తప్పనిసరిగా హెచ్ ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్ ఇతర అంటువ్యాధుల కోసం పూర్తిగా పరీక్షిస్తారు (Tested). రక్త నాణ్యత (Blood quality) నిర్ధారించుకున్న తర్వాతే రోగులకు అందిస్తారు.
