365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 6,2025: తమిళం, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ‘బల్టీ’ చిత్రం అక్టోబర్ 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎల్మా పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఉన్ని శివలింగం దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ‘ప్రేమమ్’ ఫేమ్ ఆల్పాన్స్ పుదిరన్ కూడా ప్రధాన తారాగణంలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఎల్మా పిక్చర్స్ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ, “తమిళం, మలయాళంలో మా ‘బల్టీ’కి విమర్శకుల నుంచి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ పవర్ఫుల్ కథను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సంతోషిస్తున్నాం.
మలయాళంలో ‘ఆర్.డి.ఎక్స్’తో సక్సెస్ అందుకున్న షేన్ నిగమ్ హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. సెల్వరాఘవన్ విలన్గా మెప్పించారు. ఈ చిత్రం తప్పక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది,” అని తెలిపారు.

దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ, “తమిళనాడు, కేరళ సరిహద్దులోని వెలంపాళయం గ్రామంలో జరిగే పచ్చిగా, రస్టిక్గా ఉండే విలేజ్ డ్రామా ఈ సినిమా. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దల రాజకీయ, వ్యాపార ఘర్షణల మధ్య నలుగురు కబడ్డీ ఆటగాళ్లు ఎలా చిక్కుకున్నారు.
ఆ తర్వాత జరిగే భావోద్వేగాలు, సంఘర్షణల సమాహారమే ఈ ‘బల్టీ’ చిత్రం. ఇది కబడ్డీ, రాజకీయాలు, గ్యాంగ్స్టర్ అంశాల కలయికతో విభిన్నంగా ఉంటుంది,” అని వివరించారు.
పి.ఆర్.ఓ.
దయ్యాల అశోక్
కడలి రాంబాబు