365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 15, 2025:సంపదకు, శ్రేయస్సుకు ప్రతీకగా భావించే దీపావళి పండుగకు ముందు వచ్చే పుష్య నక్షత్రానికి జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యం ఉంది. నేడు (అక్టోబర్ 15, బుధవారం) పుష్య నక్షత్రం కారణంగా ఏర్పడిన ఈ శుభయోగం, విలువైన వస్తువులు,ఆస్తులను కొనుగోలు చేయడానికి అత్యంత అనుకూలమని పండితులు చెబుతున్నారు.
పుష్య నక్షత్రం ఎందుకు అంత శుభకరం?
లక్ష్మీదేవి అనుగ్రహం: పుష్య నక్షత్రాన్ని లక్ష్మీదేవి జన్మ నక్షత్రంగా భావిస్తారు. ఈ నక్షత్ర సమయంలో ఏ శుభకార్యాన్ని లేదా కొనుగోలును చేపట్టినా… ఆ సంపద ఇంట్లో స్థిరంగా ఉండి, రెట్టింపు అవుతుందని నమ్ముతారు.
దీర్ఘకాలిక శ్రేయస్సు: పుష్య నక్షత్రం స్థిరత్వానికి చిహ్నం. అందుకే ఈ రోజు కొన్న బంగారం, వెండి, ఇల్లు లేదా ఆస్తి దీర్ఘకాలికంగా శుభ ఫలితాలను, శ్రేయస్సును అందిస్తాయి.
నేటి శుభ సమయం: ఈరోజు పుష్య నక్షత్రం సమయంలో ముఖ్యంగా ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో షాపింగ్ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతారు.

నేడు కొనుగోలు చేయదగిన శుభ వస్తువులు..
బంగారం,వెండి: సంపద కోసం బంగారం, వెండి ఆభరణాలు లేదా నాణేలు.
వాహనాలు: కొత్త కార్లు, మోటార్ సైకిళ్లు కొనుగోలు చేయడానికి.
స్థిరాస్తి (Property): భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి, లేదా నిర్మాణ పనులు ప్రారంభించడానికి. దీపావళి షాపింగ్‌ను నేటి నుంచే ప్రారంభించి, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందండి!