365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫ్రాన్స్, అక్టోబర్ 23,2025: గత సంవత్సరంలో ఏకంగా 171 శాతం వరకు భారీ లాభాలను అందించాయి. వీటిలో మీరు పెట్టుబడి పెట్టి ఉంటే నిజంగా ధనవంతులు అయ్యేవారు..! సాధారణంగా రూ. 10 లోపు ధర ఉండే షేర్లను ‘పెన్నీ స్టాక్స్’ అంటారు.
ఇవి చిన్న కంపెనీలవి కావడం వల్ల ఎక్కువ రిస్క్‌తో పాటు, అధిక అస్థిరత (High Volatility) కలిగి ఉంటాయి. తక్కువ ధరకే దొరుకుతున్నాయని కొనే పెట్టుబడిదారులు, భవిష్యత్తులో వీటి ధర పెరుగుతుందని ఆశిస్తారు.
అయితే, ఈ కంపెనీల ఆర్థిక స్థితి అంత బలంగా ఉండదు కాబట్టి, ఇందులో పెట్టుబడి చాలా రిస్క్‌తో కూడుకున్నది. అందుకే, పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా పరిశోధన చేయాలి. అయినప్పటికీ, కొన్ని పెన్నీ స్టాక్స్ ఊహించని విధంగా భారీ లాభాలను తెచ్చిపెడతాయి. అలాంటి ఐదు స్టాక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

- ఓన్టిక్ ఫిన్‌సర్వ్ (Ontic Finserve Share Price):
ప్రస్తుత ధర: రూ. 1.90
గత 1 సంవత్సరంలో వృద్ధి: 171.43 శాతం
ఈ ఏడాదిలో వృద్ధి (2025): 183.6 శాతం
మార్కెట్ క్యాపిటల్: రూ. 17.10 కోట్లు
- ఎక్సెల్ రియాలిటీ ఎన్ ఇన్ఫ్రా (Excel Realty N Infra Share Price)..
ఈ స్టాక్ గత సంవత్సరంలో పెట్టుబడిదారుల డబ్బును ‘డబుల్’ చేసింది.
గత 1 సంవత్సరంలో వృద్ధి: 100 శాతం
ఈ ఏడాదిలో వృద్ధి (2025): 24.80 శాతం
ప్రస్తుత ధర: రూ. 1.56

మార్కెట్ క్యాపిటల్: రూ. 218.66 కోట్లు
- సిస్ట్రో టెలిలింక్ (Cistro Telelink Share Price):
ప్రస్తుత ధర: రూ. 0.94
గత 1 సంవత్సరంలో వృద్ధి: 28.77 శాతం
ఈ ఏడాదిలో వృద్ధి (2025): 23.68 శాతం
మార్కెట్ క్యాపిటల్: రూ. 4.83 కోట్లు
- సత్వ సుకున్ లైఫ్‌కేర్ (Sattva Sukun Lifecare Share Price):
ప్రస్తుత ధర: రూ. 0.82
గత 1 సంవత్సరంలో వృద్ధి: 24.3 శాతం
1980లో ప్రారంభమైన ఈ కంపెనీ అరోమా ఆయిల్స్, కర్పూరం ఆధారిత ఫ్రెషనర్స్, చెక్క/గాజు హస్తకళలను తయారు చేస్తుంది.
- విజన్ సినిమాస్ (Vision Cinemas Share Price):
ప్రస్తుత ధర: రూ. 1.30
గత 1 సంవత్సరంలో వృద్ధి: 20.4 శాతం
మార్కెట్ క్యాపిటల్: రూ. 9.21 కోట్లు
ఈ కంపెనీ 1992లో మొదలైంది.
గమనిక: పెన్నీ స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువ కాబట్టి, వీటిలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం, పూర్తిగా పరిశోధన చేయడం చాలా అవసరం.