365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 23,2025: ఇప్పుడు ఏది కొనాలన్నా షాప్ కు వెళ్లకుండా.. ఇంట్లో నుంచే షాపింగ్ చేసేయవచ్చు. అదే..! ఆన్‌లైన్ షాపింగ్… విపరీతంగా పెరిగిన ఈ డిజిటల్ యుగంలో, వినియోగదారులను తెలివిగా మోసం చేసి, వారికి తెలియకుండానే అనవసర కొనుగోళ్లు చేయించే డిజిటల్ ఉపాయాలు (Digital Tricks) పెరిగిపోయాయి.

వీటినే ‘డార్క్ ప్యాటర్న్స్’ (Dark Patterns) అంటారు. ఈ మోసపూరిత విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేసి, ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఏమిటీ ‘డార్క్ ప్యాటర్న్స్’ మాయాజాలం?’డార్క్ ప్యాటర్న్స్’ అంటే…?

ఏదైనా వస్తువును కొనడానికి లేదా సేవను పొందడానికి వినియోగదారులు ఆన్‌లైన్ వేదికలపైకి వచ్చినప్పుడు, వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసి, తప్పుదారి పట్టించి లేదా బలవంతంగా కంపెనీలకు లాభం చేకూర్చేలా చేసే మోసపూరిత ఇంటర్‌ఫేస్ డిజైన్‌లు.

మీరు ఒక వస్తువు కొనాలని చూస్తుంటే, మీకు తెలియకుండానే కార్ట్‌లో అదనపు వస్తువులు చేరడం లేదా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలంటే పది మెట్ల ప్రక్రియను దాటాల్సి రావడం వంటివన్నీ ఈ డార్క్ ప్యాటర్న్స్‌ కిందకే వస్తాయి. దీనివల్ల వినియోగదారులకు సమయం, డబ్బు వృథా అవుతాయి.

ముఖ్యమైన డార్క్ ప్యాటర్న్స్ రకాలు..?

సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఇప్పటికే 13 రకాల డార్క్ ప్యాటర్న్స్‌ను గుర్తించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:డార్క్ ప్యాటర్న్వివరణఫాల్స్ అర్జెన్సీ (False Urgency)”ఆఫర్ ఇంకో 10 నిమిషాల్లో ముగుస్తుంది!” లేదా “కొద్దిపాటి స్టాకు మాత్రమే మిగిలి ఉంది!” అంటూ తొందరపెట్టి, భయంతో కొనేలా ప్రేరేపించడం.బాస్కెట్ స్నీకింగ్ (Basket Sneaking)యూజర్ అనుమతి లేకుండానే షాపింగ్ కార్ట్‌లో అదనపు వస్తువులు, డొనేషన్ లేదా చారిటీ పేరిట చిన్న మొత్తాలను జోడించడం.

సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్సేవలకు సులభంగా సైన్ అప్ చేసేలా చేసి, కానీ వాటిని రద్దు చేసుకునే ప్రక్రియను చాలా కష్టతరం చేయడం.కన్ఫర్మ్ షేమింగ్ (Confirm Shaming)ఏదైనా వస్తువు/సేవ వద్దు అని చెప్పేందుకు ప్రయత్నిస్తే, “నో థ్యాంక్స్, ఐ హేట్ ద ఎన్విరాన్‌మెంట్” లేదా “సేవింగ్స్ నాకు అవసరం లేదు” వంటి వాక్యాలు కనిపించేలా చేసి, మనమేదో అపరాధం చేస్తున్నామన్న భావన కల్పించడం.

హిడెన్ కాస్ట్స్ (Hidden Costs)మొదట తక్కువ ధర చూపించి, చెల్లింపు (Payment) చేసే సమయంలో హ్యాండ్లింగ్ ఫీజు, సర్జ్ ఫీజు వంటి దాచిన ఖర్చులను అదనంగా జోడించడం.

కేంద్రం చర్యలు, కఠిన హెచ్చరికలుఆన్‌లైన్ వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు, CCPA డార్క్ ప్యాటర్న్స్‌పై నిషేధం విధిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు భారతదేశంలో వస్తు, సేవలను అందించే అన్ని ప్లాట్‌ఫామ్స్‌తోపాటు అడ్వర్టైజర్స్‌, సెల్లర్స్‌కు కూడా వర్తిస్తాయి.

స్వీయ ఆడిట్ ఆదేశం: తమ ప్లాట్‌ఫారమ్‌లలో డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయో లేదో 3 నెలల్లోగా గుర్తించి, వాటిని తొలగించాలని ఈ-కామర్స్ సంస్థలను కేంద్రం ఆదేశించింది.

జరిమానా హెచ్చరిక: ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై వినియోగదారుల రక్షణ చట్టం కింద కఠిన చర్యలు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

పరిష్కారానికి కృషి: ఈ సమస్యను పరిష్కరించేలా సరికొత్త యాప్‌లు, సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు ‘డార్క్ ప్యాటర్న్స్ బస్టర్’ పేరిట ఒక హ్యాకథాన్‌ను కూడా నిర్వహించింది.కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది. ఆన్‌లైన్ వేదికలపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగే అవకాశం ఉంది.