365తెలుగు కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 19,2025: భారత్‌లో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల డిమాండ్ రోజురోజుకూ భలేగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మురుగప్ప గ్రూప్‌కు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ భారీ ఎక్స్‌పాన్షన్ మోడ్‌లోకి దిగింది.

ఇప్పటికే చిన్న కమర్షియల్ వాహనాల (SCV) సెగ్మెంట్‌లో ‘ఏవియేటర్’ ఎలక్ట్రిక్ ట్రక్‌తో సంచలనం సృష్టించిన ఈ కంపెనీ… వచ్చే ఏడాది మరో కొత్త ఎలక్ట్రిక్ ట్రక్‌ను లాంచ్ చేయనుంది..

కొత్త ట్రక్ ఏ సెగ్మెంట్‌లో వస్తుందంటే..?
తాజా సమాచారం ప్రకారం… ముందుగా 3.5 టన్నుల కంటే తక్కువ GVW ఉన్న చిన్న కమర్షియల్ ట్రక్‌ను రంగంలోకు దింపనున్నారు. ఆ తర్వాత 3.5 నుంచి 7.5 టన్నుల మధ్య మరిన్ని కొత్త మోడళ్లు కూడా రానున్నాయి. అంటే SCV నుంచి LCV సెగ్మెంట్ వరకు మోంట్రా ఎలక్ట్రిక్ పూర్తి రేంజ్‌తో దూసుకుపోనుంది..

ఇప్పటికే రంగంలో ఉన్న ఏవియేటర్ ట్రక్ ఫీచర్లు
ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన మోంట్రా ఏవియేటర్ (3.5 టన్నులు)

80 kWh బ్యాటరీ ప్యాక్
ఒకే ఛార్జ్‌కు 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్
సంవత్సరానికి 2.5 లక్షల కిలోమీటర్ల వారంటీ – ఇదే సెగ్మెంట్‌లో బెస్ట్..

భారీ ప్లాన్… భారీ ప్లాంట్..
ఈ వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా తమిళనాడులోని పొన్నేరిలో 5 లక్షల చదరపు అడుగుల విసతితో కొత్త అత్యాధునిక తయారీ కేంద్రాన్ని సిద్ధం చేసుకుంది మోంట్రా. ఈ ప్లాంట్ సంవత్సరం సామర్థ్యం – ఏకంగా 50,000 యూనిట్లు.

మొత్తంగా చూస్తే… ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహన మార్కెట్‌లో టాటా, అశోక్ లేల్యాండ్, మహీంద్రాలతో పోటీ పడేందుకు మోంట్రా ఎలక్ట్రిక్ పూర్తి రెడీ అయిపోయింది. వచ్చే ఏడాది నుంచి రోడ్లపై మోంట్రా ఎలక్ట్రిక్ ట్రక్కుల సందడి మొదలవనుంది.