365తెలు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 19,2025: కేవలం రూ.5 సరసమైన ధరకు అనుకూలమైన ప్యాకేజింగ్ రూపంలో, సరదాగా, స్క్వీజబుల్ (నొక్కబడే) – రిచ్ అండ్ స్మూత్ మోల్టన్ చాకో, చాకో మెల్ట్జ్ను ప్రారంభించడం ద్వారా ITC సన్ ఫీస్ట్ ఫెంటాస్టిక్! ఆనందపు అనుభవాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. సన్ ఫీస్ట్ ఫెంటాస్టిక్! Choco Meltz అనేది ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి, ఇది చాక్లెట్ ను కేవలం బార్ లేదా బైట్ గా మాత్రమే కాకుండా, విలక్షణమైన అనుభవంగా కూడా తిరిగి ఊహిస్తుంది.
ప్యాక్ నుండి నేరుగా తాగినా, బ్రౌనీస్ పై చల్లినా, పరాఠా,టోస్ట్ పై రాసినా, లేదా ఐస్ క్రీంలు & పండ్లపై పోసినా, Choco Meltz సాధారణ క్షణాలను ఆనందకరమైన క్షణాలుగా మారుస్తుంది. దీని లాంచింగ్ తో, సన్ ఫీస్ట్ ఫెంటాస్టిక్! కాటగిరి ఆవిష్కరణ శ్రేణిలో ప్రముఖమైనదిగా కొనసాగుతోంది, చాకొలెటీ ఆనందాన్ని ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఆనందించడానికి ఆధునిక వినియోగదారులకు ఆధునికమైన, ఉత్తేజకరమైన పద్ధతిని అందిస్తోంది.
రోజూవారీ “యమ్” క్షణాలను “యమ్మీ” ఆనందాలుగా మార్చడం ద్వారా ప్రేరణ పొందిన, ఉత్పత్తి FCB ఉల్కాచే రూపొందించిన కొత్త TVCల సీరీస్ లో ప్రధానమైన ఆకర్షణను సంపాదించింది. ఉల్లాసకరమైన, సంబంధిత పరిస్థితులైన – తమ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా మోల్టెన్ చాకో సమయాలను తోబుట్టువులు పంచుకోవడం, బెస్ట్ ఫ్రెండ్స్ డెస్క్ క్రింద రుచి చూడటం నుంచి అమ్మ- పిల్లల వివిధ ఆహార పదార్థాలను రుచి చూడటం వరకు చాకో మెల్ట్జ్ మేజీక్ ను ఫిల్మ్ నిజం చేస్తుంది.

ప్రతి కథ సాధారణమైన స్నాక్స్ ను నోరూరించే ట్రీట్స్ గా మార్చే ఆనందాన్ని చూపిస్తుంది, బ్రాండ్ కొత్త నినాదం: “యమ్ నుంచి యమ్మీ” ను సూచిస్తుంది. ప్రారంభోత్సవం సందర్భంగా, అనుజ్ బన్సల్, VP & హెడ్ ఆఫ్ మార్కెటింగ్, కన్ఫెక్షనరి, చాకొలెట్స్ అండ్ కాఫీ, ఫుడ్స్ డివిజన్, ITC లిమిటెడ్ ఇలా అన్నారు, “సన్ ఫీస్ట్ ఫెంటాస్టిక్! రూ.5కే లభించే చాకో మెల్ట్జ్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించడం గురించి & అందరికీ అందుబాటులో ఉంచడం గురించి సంబంధించినది.
రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయవలసిన అవసరం లేని & బ్రెడ్, రోటీ, పరాఠా, పండ్లు, పాలు మొదలైన వాటిపై ఉపయోగించదగిన ఇది ఒక సంపూర్ణమైన మోల్టెన్ ఉత్పత్తి. ఆనందం కోసం వినియోగదారుల కోరికతో ఎంతగానో భావోద్వేగ సంబంధాన్ని కలిగిన శ్రేణి ఆవిష్కరణపై సన్ ఫీస్ట్ ఫెంటాస్టిక్ చూపించిన శ్రద్ధకు ఈ కొత్త లాంచ్ ఒక నిదర్శనంగా నిలిచింది.”
కాంపైన్ పై వ్యాఖ్యానిస్తూ, సుచిత్రా గహ్లోట్, నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ FCB Ulka ఇలా అన్నారు, “ఈ కాంపైన్ లో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సన్ ఫీస్ట్ ఫెంటాస్టిక్! చాకో మెల్ట్జ్ ఎంతో విలక్షణమైన ఉత్పత్తి మరియు భావోద్వేగం,ఆనందాలు రెండూ ఏ విధంగా ఒకే చోట ఉంటాయో మేము ఈ కాంపైన్ ద్వారా చూపించాలని కోరుకున్నాము.

చాకొలెట్,సాధారణ రోజూవారీ భావాలు ఏ విధంగా హృదయాలను స్పందింపచేసి, ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి ఇది చూపిస్తుంది.” 1 జూన్ 2025న ప్రారంభమైన, ఈ ప్రోడక్ట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు & తెలంగాణలో లభిస్తోంది, కేవలం రూ.5కే లభిస్తోంది, చాకొలెటీ ఆనందాన్ని సరదాగా & ఆనందంగా చేస్తోంది.
