365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 28,2025: రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరైన జనప్రియ గ్రూప్ మరో సంచలన మైలురాయి అధిగమించింది. 40 ఏళ్ల అద్భుత ప్రయాణం.. 40 వేల ఫ్లాట్ల డెలివరీతో జనప్రియ ఉప్స్కేల్ ఘనంగా 40వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంది.

అదే సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కె. రవీందర్ రెడ్డి 72వ జన్మదినాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ప్రముఖ సింగర్ రేవంత్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన జనప్రియ ఉప్స్కేల్ మేనేజింగ్ డైరెక్టర్ కె. క్రాంతి కిరణ్ రెడ్డి.. ‘‘40 ఏళ్లుగా ఎన్నో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ మార్పులను తట్టుకుని.. వీల్ పవర్‌తో ఈ ఎత్తుకు ఎదిగాం.

నా తండ్రి రవీందర్ రెడ్డి వేసిన బలమైన పునాదిపైనే ఈ విజయం సాధ్యమైంది. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుత ప్రాజెక్టులతో ముందుకు సాగుతాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

సంస్థ వ్యవస్థాపకుడు కె. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇల్లు కొనాలంటే హౌసింగ్ లోన్ కోసం పడ్డ ఇబ్బందులు చూసి.. అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలనే సంకల్పంతో జనప్రియ పుట్టింది.

హౌసింగ్ బోర్డు, హుడా, హెచ్‌డీఎఫ్‌సీల నుంచి స్ఫూర్తి పొందాను. ఈ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం.. కానీ 40 వేల కుటుంబాలకు సొంత ఇల్లు అందించడమే మా అతి పెద్ద సంతోషం’’ అని భావోద్వేగంగా తెలిపారు.

జనప్రియ అంటే నమ్మకం.. నాలుగు దశాబ్దాల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఈ వేడుకలు సంస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోయాయి.