365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబరు 29,2025: దేశంలోనే అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్… తన ఫ్లాగ్‌షిప్ CSR కార్యక్రమం ‘దోస్త్ సేల్స్’ను ఈ ఏడాది మూడింతలు పెంచేసింది! ఈ కార్యక్రమం ద్వారా తక్కువ అవకాశాలున్న కమ్యూనిటీల నుంచి వచ్చిన 9,400 మంది యువత–యువతులకు ఫ్రంట్‌లైన్ రిటైల్ ఉద్యోగాలకు పూర్తి శిక్షణ ఇచ్చి, శాశ్వత ఉద్యోగాల్లో ప్లేస్‌మెంట్ కల్పించనుంది.

2021లో మొదలైన ‘దోస్త్ సేల్స్’ ఇప్పుడు 4.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయింది. ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ (ESSCI) & టెలికాం సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ (TSSC)తో కలిసి శామ్‌సంగ్ ఈ మెగా స్కిల్లింగ్ మిషన్‌ను నడుపుతోంది.

ఎలాంటి శిక్షణ?

120 గంటల ఆన్‌లైన్ క్లాస్‌రూమ్ ట్రైనింగ్
60 గంటల శామ్‌సంగ్ రిటైల్ స్టోర్లలో ప్రాక్టికల్ ట్రైనింగ్
5 నెలల ఆన్-ద-జాబ్ ట్రైనింగ్ (OJT) + నెలవారీ స్టైపెండ్
కస్టమర్ హ్యాండిలింగ్, సేల్స్ టెక్నిక్స్, ప్రొడక్ట్ డెమో, స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి రియల్-టైమ్ స్కిల్స్

కోర్సు పూర్తి చేసిన వాళ్లకు ప్రభుత్వం గుర్తించిన NSQF సర్టిఫికేట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో దేశంలో ఎక్కడైనా రిటైల్ రంగంలో శాశ్వత ఉద్యోగం సులువుగా దొరుకుతుంది.

శామ్‌సంగ్ అధికార ప్రతినిధి శ్రీ శుభమ్ ముఖర్జీ మాటల్లో…
“ముఖ్యంగా తక్కువ అవకాశాలున్న వర్గాల యువతకులకు ఆత్మవిశ్వాసం, జ్ఞానం, ప్రాక్టికల్ స్కిల్స్ ఇచ్చి… వాళ్లను రిటైల్ రంగంలో రాణించేలా తయారు చేయడమే దోస్త్ సేల్స్ లక్ష్యం. ఈ ఏడాది నమోదులు మూడింతలు పెరగడం ఈ ప్రోగ్రామ్ విజయాన్ని చూపిస్తోంది.”

ESSCI చైర్మన్ వినోద్ శర్మ, TSSC CEO లెఫ్టినెంట్ జనరల్ కె.హెచ్. గవాస్ కూడా ఈ కార్యక్రమాన్ని “యువతకు శాశ్వత ఉపాధి, సమ్మిళిత ఆర్థిక వృద్ధికి బలమైన అడుగు” అంటూ ప్రశంసించారు.

దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆర్గనైజ్డ్ రిటైల్ సెక్టార్‌కు నైపుణ్యం గల మానవ వనరులను సమకూర్చడంలో శామ్‌సంగ్ ‘దోస్త్ సేల్స్’ నిజంగానే దోస్త్ అవుతోంది!