365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 30,2025: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి – కాకతీయ కాలనీలో రెండు పార్కులను (600 గజాలు, 1500 గజాలు) కాపాడినందుకు హైడ్రా (HMDA)కు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు ఆనందోత్సాహంతో ర్యాలీ నిర్వహించారు.

వందలాది మంది పిల్లలు రంగురంగుల ప్లకార్డులు పట్టుకొని, “హైడ్రా జిందాబాద్.. హైడ్రా ధన్యవాదాలు! మాకు ఆడుకునే పార్కు దొరికింది.. పచ్చదనం కాపాడిన హైడ్రాకు జోహార్లు!” అంటూ నినాదాలు చేశారు.
చిన్నారులు సంబరపడుతూ, “ప్రాణవాయువు ఇచ్చే పార్కులను కాపాడారు.. మేము మొక్కలు నాటి, జాగ్రత్తగా పెంచుతాం” అని హామీ ఇచ్చారు.
పార్కులను కాపాడి, పిల్లలకు ఆడుకునే చోటు, ప్రజలకు ఊపిరి పీల్చుకునే ప్రదేశం అందించిన హైడ్రాకు ఈ ముద్దుల ర్యాలీ ఒక గొప్ప కానుకగా నిలిచింది.
