365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 16,2025: తెల్లపాలెం (ఎర్రుపాలెం మండలం Errupalem Mandal): ఖమ్మం జిల్లా(Khammam district), ఎర్రుపాలెం మండల పరిధిలోని తెల్లపాలెం (Tellapalem) గ్రామానికి చెందిన యువకుడు వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి (Vemireddy Karthik) Reddyఅంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటారు.

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థ(Google)నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Artificial Intelligence) పోటీలో పాల్గొని, లక్షలాది మంది పోటీదారుల మధ్య ద్వితీయ బహుమతిని (second prize) గెలుచుకుని రూ. 6,50,000 నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.

సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడైన కార్తీక్ రెడ్డి, ఖమ్మంలో ఇంటర్ పూర్తి చేసి ట్రిపుల్ ఐటీ (IIIT)లో బీటెక్ చదివారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో రూ. 18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినప్పటికీ, ఉన్నత విద్యపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి అమెరికా బాట పట్టారు.

ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న కార్తీక్, అక్కడి వరల్డ్ వైడ్ క్యాన్సర్ రీసెర్చ్ టీంలో సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ అనుభవంతోనే ప్రపంచ స్థాయి కోడింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొంటున్న ఆయన.

తాజాగా గూగుల్ నిర్వహించిన ప్రపంచ పోటీలో సెకండ్ విన్నర్‌గా నిలిచి తన ప్రతిభను నిరూపించు కున్నారు. కార్తీక్ రెడ్డి సాధించిన ఈ ఘనత పట్ల తెల్లపాలెం గ్రామ ప్రజలు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.