365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 17,2025: సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. హారర్ థ్రిల్లర్,అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొత్త కోణంలో వరలక్ష్మి శరత్ కుమార్
ఈ సినిమా విశేషాలను దర్శకుడు సంజీవ్ మేగోటి వివరిస్తూ.. “ఇది కేవలం హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు, అన్ని వర్గాలను అలరించే ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. వరలక్ష్మి ఇందులో పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో మెప్పించనున్నారు. ఆమె సహకారం వల్లే కేవలం 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగాం” అని తెలిపారు.

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ చెప్పిన కథ, నా పాత్రలోని వైవిధ్యం నచ్చి ఈ సినిమా చేశాను. యాక్షన్ తో పాటు ఇందులో నేను చేసిన కామెడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

చిత్ర విశేషాలు:
నటీనటులు: నవీన్ చంద్ర పవర్‌ఫుల్ హీరోగా నటించగా, కన్నడ స్టార్ రాగిణి ద్వివేది కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి 52 మంది సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు.

సాంకేతిక వర్గం: ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్ – రవితేజల యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

భాషలు: ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, అడివి సాయి కిరణ్ తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు సంజీవ్ మేగోటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను, కంటెంట్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అతిథులు కొనియాడారు.

త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:-
మేకప్: విజయ్ – శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: నల్లపు సతీష్
కో డైరెక్టర్స్ :- మద్దాలి కృష్ణ – వెంకట నారాయణ
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ :- పేరం అయాన్ష్ రెడ్డి (అశోక్)
పవన్ కుమార్ గొడవర్తి
అసోసియేట్ డైరెక్టర్స్ :- కృష్ణ మూర్తి – ఎన్. రామ్ కుమార్
అసిస్టెంట్  దర్శకులు :-
ముదిగోళ్ల నవీన్ కుమార్   – కంచె వీరేష్- స్వాతి మంగపురం-
కె. మహేశ్వర్- కందెల గణేష్- యశ్వంత్ కుమార్
పోస్టర్ డిజైన్:- రమణ బ్రష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:- సతీష్ బాబు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ :- బిజివేముల రాజశేఖర్ రెడ్డి
ప్రొడక్షన్ మేనేజర్స్ :- రమేష్-కొల్లా గంగాధరం
ప్రొడక్షన్ డిజైనర్: కొండపనేని మురళీధర్
ఆర్ట్ డైరెక్టర్ : కె.వి.రమణ
ఎడిటర్ : అనుగోజు రేణుకాబాబు
కొరియోగ్రఫీ: సన్ రేస్ (సూర్య కిరణ్), రాజ్ పైడి, బాబా
ఫైట్స్  : – డ్రాగన్ ప్రకాష్- రవితేజ
సంగీతం: ఆరోహణ సుధీంద్ర – సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో
DOP:- SN. హరీష్
నిర్మాత : బాలకృష్ణ మహారాణా
రచన, దర్శకత్వం:- సంజీవ్ మేగోటి

పీఆర్ఓ: అశోక్ దయ్యాల.