365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజయవాడ, డిసెంబర్ 30, 2025: ఓరల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నోటిలో చిన్న పుండు పడిందా? వేడి చేసిందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారా? నాలుకపై తరచూ మంట పుడుతోందా?

అయితే మీరు ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నట్లే! మన శరీర రక్షణ వ్యవస్థే మనకు శత్రువుగా మారే ‘దీర్ఘకాలిక వాపు’ (Chronic Inflammation) నోటి క్యాన్సర్‌కు ఎలా పునాది వేస్తుందో విజయవాడలోని హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్ కు చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డా. బొప్పాన సాయి మాధురి హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

సాధారణంగా శరీరానికి గాయం అయినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, దానిని నయం చేయడానికి రోగనిరోధక వ్యవస్థ పంపే సైన్యమే ‘వాపు’ (Inflammation). ఇది తాత్కాలికంగా ఉంటే రక్షణ కవచం, కానీ అదే పనిగా కొనసాగితే మాత్రం ప్రాణాంతక వ్యాధులకు దారితీసే విధ్వంసకారిగా మారుతుంది.

ముఖ్యంగా మన దేశంలో పొగాకు, పాన్ వంటి అలవాట్ల వల్ల నోటిలో ఈ వాపు ‘నిశ్శబ్ద శత్రువు’లా తిష్టవేస్తోంది.

రక్షణ వ్యవస్థే శత్రువైతే..?

Read this also: Dr. Sonia Datta Calls for a “Total Body” Oral Wellness Revolution in 2026..

ఇదీ చదవండి :పెట్టుబడిదారులకు షాకిచ్చిన టైమెక్స్ ఇండియా..

మన శరీరంలోని రోగనిరోధక కణాలు ఇన్ఫెక్షన్‌ను అరికట్టిన తర్వాత సాధారణ స్థితికి చేరుకోవాలి. కానీ, నోటిలో నిరంతరం ఇర్రిటేషన్ (pain or iritation) కలిగించే కారకాలు ఉన్నప్పుడు, ఈ రక్షణ వ్యవస్థ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. దీనివల్ల:

కణజాలాల్లో మంట..
కణాల జన్యు నిర్మాణం దెబ్బతిని, అసాధారణ కణాలు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, నెలల తరబడి గమనించని చిన్న మార్పులే కాలక్రమేణా క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతాయి.

ఈ అలవాట్లే ప్రధాన కారణాలు..

Read this also: JSW MG Motor India announces an industry-first extended Assured Buy Back Program for its EVs

మన దైనందిన జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు దీర్ఘకాలిక వాపును పెంచి క్యాన్సర్‌కు మార్గం సుగమం చేస్తాయి. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ వంటివి వ్యసనాలు నోటి లోపలి సున్నితమైన పొరను నిరంతరం గాయపరుస్తాయి.

సరిగ్గా అమరని దంత పరికరాలు లేదా విరిగిన పదునైన పళ్లు నాలుకను, చెంపను పదేపదే తాకడం వల్ల ఏర్పడే గాయాలు మానవు.

నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల చేరే బ్యాక్టీరియా నిరంతర ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అతిగా కారం, మసాలాలు, మితిమీరిన వేడి పదార్థాలు తీసుకోవడం వల్ల కణజాలం ఒత్తిడికి లోనవుతుంది.

హెచ్చరిక సంకేతాలను గుర్తించండిలా..

Read this also: Dr. Sonia Datta Calls for a “Total Body” Oral Wellness Revolution in 2026..

కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులు ప్రాథమిక దశలోనే ఈ మార్పులను గమనించడం ముఖ్యం.

రెండు వారాలు దాటినా తగ్గని నోటి పుండ్లు.

నోటిలో మానని తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు.

కారం లేని ఆహారం తిన్నా విపరీతమైన మంట అనిపించడం.

నోరు పూర్తిగా తెరవలేకపోవడం లేదా చెంప లోపల గట్టిగా, మందంగా అనిపించడం.

ఇదీ చదవండి :పెట్టుబడిదారులకు షాకిచ్చిన టైమెక్స్ ఇండియా..

నివారణ..

చెడు అలవాట్లకు దూరం.. పొగాకు, ధూమపానం, మద్యం పూర్తిగా మానేయడమే నోటి క్యాన్సర్‌ను అడ్డుకునే తొలి మెట్టు.

తనిఖీ..పళ్లలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, నోటిలో చిన్న మార్పులు వచ్చినా వెంటనే డెంటిస్ట్ లేదా ఆంకాలజిస్టును సంప్రదించి స్క్రీనింగ్ చేయించుకోవాలి.

పోషకాహారం.. తాజా పండ్లు, ఆకుకూరలు, సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి అందే ‘యాంటీఆక్సిడెంట్లు’ వాపును తగ్గించి కణాల మరమ్మతుకు తోడ్పడతాయి.

గుర్తుంచుకోండి.. నోటి ఆరోగ్యం అంటే కేవలం పళ్లు మెరవడం కాదు, అది మన మొత్తం శరీర ఆరోగ్యానికి దర్పణం. మంటను తొలిదశలోనే ఆర్పే శక్తి మన చేతుల్లోనే ఉంది. చిన్న పుండును నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు!-డా. బొప్పాన సాయి మాధురి, మెడికల్ ఆంకాలజిస్ట్, హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ.