365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2025:భారతదేశంలో రేషన్ కార్డు కేవలం నిత్యావసర వస్తువులు పొందే పత్రం మాత్రమే కాదు, అది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు కూడా. అయితే, రేషన్ కార్డులు వేర్వేరు రంగుల్లో ఉండటం మనం గమనిస్తు ఉంటాం.

ఈ రంగులు కేవలం అలంకారం కోసం కాకుండా,మధ్యతరగతి కుటుంబంల ఆర్థిక స్థితిగతులను,వారికి అందే ప్రభుత్వ ప్రయోజనాలను సూచిస్తాయి. దాని వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్’ (NFSA) కింద అర్హులైన వారికి ఉచితంగా లేదా తక్కువ ధరకే ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తోంది. లబ్ధిదారుల వర్గీకరణ కోసం కార్డులను ప్రధానంగా నాలుగు రంగులుగా విభజించారు.అవి

  1. తెలుపు రంగు రేషన్ కార్డు:సాధారణంగా దారిద్య్ర రేఖకు ఎగువన (APL) ఉన్న కుటుంబాలకు ఈ కార్డును జారీ చేస్తారు.

ప్రయోజనాలు: ఈ కార్డు ఉన్నవారు ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ ధరల వద్ద రేషన్ పొందవచ్చు.

దీనితో పాటు ఉజ్వల యోజన (ఉచిత గ్యాస్ కనెక్షన్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల్లో సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది.

  1. పసుపు రంగు రేషన్ కార్డు:ఈ కార్డును దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న నిరుపేద కుటుంబాలకు అందిస్తారు.

ప్రయోజనాలు: వీరికి గోధుమలు, బియ్యం, పప్పులు, చక్కెర ,కిరోసిన్ వంటి వస్తువులు సాధారణ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

ఇదీ చదవండి :Oral cancer : నోటిలో పుండు క్యాన్సర్‌కు దారితీస్తుందా..?

Read this also: Dr. Sonia Datta Calls for a “Total Body” Oral Wellness Revolution in 2026..

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఈ కార్డు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.

3.పింక్ (గులాబీ) లేదా ఎరుపు రంగు కార్డు: ఆర్థికంగా స్థితిమంతులైన కుటుంబాలకు ఈ తెలుపు రంగు కార్డును కేటాయిస్తారు.

వీరు ఆహార ధాన్యాల కోసం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడని వర్గానికి చెందినవారు.

ప్రయోజనాలు: ఈ కార్డును ప్రధానంగా చిరునామా ధృవీకరణ (Address Proof) లేదా గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాథమిక ప్రభుత్వ పథకాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

  1. అంత్యోదయ (నీలం లేదా ఇతర రంగులు) కార్డు:
    అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలకు (అత్యంత నిరుపేదలు) ఈ కార్డును కేటాయిస్తారు. దీని ద్వారా అత్యధిక స్థాయిలో సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు లభిస్తాయి.

ఇదీ చదవండి :పెట్టుబడిదారులకు షాకిచ్చిన టైమెక్స్ ఇండియా..

Read this also: JSW MG Motor India announces an industry-first extended Assured Buy Back Program for its EVs

రేషన్ కార్డు రంగును బట్టి ప్రభుత్వం ఒక కుటుంబానికి ఎంత మేరకు ఆర్థిక సాయం లేదా సబ్సిడీ అందించాలో నిర్ణయిస్తుంది.