365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చండీగఢ్, జనవరి 10, 2026: చిన్న పిల్లలు వాడే ఒక రకమైన దగ్గు సిరప్‌పై హర్యానా ప్రభుత్వం తక్షణ నిషేధం విధించింది. ఆ సిరప్‌లో ప్రాణాంతక రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

విషపూరిత రసాయనాల గుర్తింపు..

‘ఆల్మాంట్-కిడ్’ (Almant-Kid) పేరుతో విక్రయించే లెవోసెటిరిజైన్,మాంటెలుకాస్ట్ సోడియం సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ (EG) అనే రసాయనం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ రసాయనం శరీరంలోకి చేరితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిషేధిత ఔషధం వివరాలు ఇవే..
ప్రభుత్వం నిషేధించిన ఈ మందుల బ్యాచ్‌కు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. మీ వద్ద ఈ మందు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి:

ఔషధం పేరు: ఆల్మాంట్-కిడ్ (Almant-Kid Syrup)

బ్యాచ్ నంబర్: AL-24002

తయారీ తేదీ: జనవరి 2025

ఎక్స్‌పైరీ తేదీ: డిసెంబర్ 2026

తయారీ సంస్థ..ట్రిడస్ రెమెడీస్ (బీహార్‌లోని హాజీపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సంస్థ)

మంత్రి ఆదేశాలతో రంగంలోకి యంత్రాంగం..

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో ఏఐపీసీ జాతీయ కార్యవర్గ సమావేశం: ‘ఆకాంక్షల రాజకీయాలే’ లక్ష్యం..

ఇదీ చదవండి:నవ్వుల ‘మిత్ర మండలి’.. తారల ‘సంక్రాంతి అల్లుళ్లు’.. ఆదివారం మీ జీ తెలుగులో!

రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆర్తి సింగ్ రావు ఆదేశాల మేరకు ఈ సిరప్ కొనుగోళ్లు , అమ్మకాలను తక్షణమే నిలిపివేశారు. నాణ్యత లేని మందుల విషయంలో రాజీ పడేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Read this also:Zee Telugu’s Sankranthi Double Treat: ‘Mithra Mandali’ Premiere & Star-Studded Gala..

ఇదీ చదవండి:బంగాళాఖాతంలో ముదురుతున్న ముప్పు.. ఏపీపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్..

ఈ బ్యాచ్‌కు చెందిన సిరప్‌ను ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిసినా లేదా మీ పరిసరాల్లో ఎవరైనా ఉపయోగిస్తున్నా వెంటనే స్థానిక డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం కోరింది.