365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 17,2026: దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్ ‘టిబిజెడ్-ది ఒరిజినల్’ (TBZ-The Original) భాగ్యనగరంలో తన 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, సంస్థ హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్‌లో తన సరికొత్త, అతిపెద్ద షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నా ఈ వేడుకకు హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్‌తో 25 ఏళ్ల అనుబంధం
ముంబై వెలుపల టిబిజెడ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు హైదరాబాద్‌నే మొదటి ఎంపికగా చేసుకుంది. పంజాగుట్టలో ప్రారంభమైన ఈ ప్రయాణం, కొండాపూర్ మీదుగా ఇప్పుడు హిమాయత్‌నగర్‌కు చేరింది. సుమారు 161 ఏళ్ల వారసత్వం కలిగిన ఈ బ్రాండ్, నగరంలో తన మూడవ స్టోర్‌ను 5,775 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది.

ఖరీదైన ఆభరణాలు.. వినూత్న డిజైన్లు
కొత్త షోరూమ్‌లో వివాహ వేడుకల కోసం ప్రత్యేకమైన ‘బ్రైడల్ కలెక్షన్’తో పాటు, వినూత్నమైన “డోహ్రా కలెక్షన్” (డిటాచబుల్ జ్యువెలరీ) అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ లభించే ప్రతి ఆభరణం బిఐఎస్ (BIS) హాల్‌మార్క్,టిబిజెడ్ స్వచ్ఛత ధృవీకరణను కలిగి ఉంటుంది. రాశీ ఖన్నా మాట్లాడుతూ, టిబిజెడ్ ఆభరణాల డిజైన్లు,నాణ్యత సాటిలేనివని, ఈ కొత్త స్టోర్ ఆభరణాల ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని ప్రశంసించారు.

సిల్వర్ జూబ్లీ ఆఫర్లు..
నగరంలో తమ 25 ఏళ్ల వేడుకల సందర్భంగా మూడు స్టోర్లలోనూ (పంజాగుట్ట, కొండాపూర్, హిమాయత్‌నగర్) ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు:

బంగారం ధరపై గ్రాముకు రూ. 500 వరకు తగ్గింపు.

ఇదీ చదవండి..ఢిల్లీ, గౌహతిల్లో కోక్ స్టూడియో భారత్ లైవ్ మ్యాజిక్.. శ్రేయా ఘోషల్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేజ్!

ఇదీ చదవండి..రూ. 374 కోట్ల నికర లాభాన్ని సాధించిన సౌత్ ఇండియన్ బ్యాంక్..!

ఆభరణాల తయారీ ఛార్జీల (Making Charges) పై 100% వరకు రాయితీ.

వజ్రాభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం.

పాత బంగారం మార్పిడిపై 100% విలువ.

ఇదీ చదవండి..మోటార్‌సైకిల్ డిజైన్‌లో సరికొత్త విప్లవం: క్లాసిక్ లెజెండ్స్‌కు మరో కీలక పేటెంట్!

ఇదీ చదవండి..ఆయుర్వేద ఔషధాల్లో ‘లోహ’ స్వచ్ఛతకు సరికొత్త కొలమానం!

టిబిజెడ్-ది ఒరిజినల్ ఛైర్మన్,ఎండీ శ్రీకాంత్ జవేరి మాట్లాడుతూ, ముత్యాల నగరం హైదరాబాద్ తమకు రెండో ఇల్లు వంటిదని, ఇక్కడి కస్టమర్ల నమ్మకమే తమను ఈ స్థాయికి చేర్చిందని హర్షం వ్యక్తం చేశారు.