365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,జనవరి 20,2026: దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొయ్హ ప్రణాలికను మొదలు పెట్టబోతోంది..నగరంలో ప్రస్తుతం ఉన్న ఛార్జింగ్ పాయింట్ల కొరతను తీర్చేందుకు ఈ ఏడాది ఏకంగా 7,000 కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ‘త్రైమాసిక ప్రణాళిక’ (Quarterly Plan)ను సిద్ధం చేసింది.

ఢిల్లీలో ప్రస్తుతం 8,849 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే పెరిగిన వాహనాల దృష్ట్యా మరో 27,000 పాయింట్ల అవసరం ఉందని అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి..ఫ్రాన్స్ వైన్, షాంపేన్‌లపై 200 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించిన ట్రంప్..

Read this also..ASME EFx India 2026 Concludes, Showcasing Emerging Engineering Talent from Across India

ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కింది విధంగా లక్ష్యాలను నిర్దేశించింది:

జనవరి – మార్చి: 1,000 స్టేషన్లు

ఏప్రిల్ – జూన్: 1,500 స్టేషన్లు

జూలై – సెప్టెంబర్: 2,300 స్టేషన్లు

ఇదీ చదవండి..జూబ్లీ హిల్స్‌లో తమ 20వ క్లినిక్ ‘లేయర్స్ ప్రైవ్’ బ్రాంచ్ ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్..

ఇదీ చదవండి..ఢిల్లీ, గౌహతిల్లో కోక్ స్టూడియో భారత్ లైవ్ మ్యాజిక్.. శ్రేయా ఘోషల్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేజ్!

అక్టోబర్ – డిసెంబర్: 2,200 స్టేషన్లు

ఈ ఏడాది చివరి నాటికి నగరంలో మొత్తం ఛార్జింగ్ పాయింట్ల సంఖ్య 16,000 దాటుతుందని అంచనా.

బ్యాటరీ స్వ్యాపింగ్ స్టేషన్లు కూడా.. ఛార్జింగ్ స్టేషన్లతో పాటు, బ్యాటరీ మార్పిడి (Swapping) కేంద్రాలను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 893 కేంద్రాలకు అదనంగా ఈ ఏడాది మరో 100 కొత్త స్వ్యాపింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2026 నాటికి ఈ సంఖ్యను 1,268కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

త్వరలో ‘ఈవీ పాలసీ 2.0’: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0’ను మార్చి నాటికి నోటిఫై చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంతో కలిసి ఈ కొత్త పాలసీ ద్వారా వాహనదారులకు మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు అందనున్నాయి. గత ఏడాది ఢిల్లీలో ఏకంగా 83,423 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ కావడం గమనార్హం.