365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,జనవరి 20,2026: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియాకు వేర్వేరు ఫార్మాట్ల కోసం వేర్వేరు కోచ్‌లు (Split Coaching) ఉండాలని ఆయన ప్రతిపాదించారు.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడంతో గంభీర్ కోచింగ్ శైలిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉతప్ప చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఉతప్ప ఏమన్నారంటే? తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఉతప్ప.. టీమ్ ఇండియా ఏడాది పొడవునా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతుంటుందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి..ఢిల్లీలో ఏడాది 7,000 కొత్త ఛార్జింగ్ స్టేషన్లు.. క్వార్టర్లీ ప్లాన్ రెడీ!
ఇదీ చదవండి..ఫ్రాన్స్ వైన్, షాంపేన్లపై 200 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించిన ట్రంప్..
“భారత్ చాలా ఎక్కువ క్రికెట్ ఆడుతోంది. ఒకే కోచ్ అన్ని ఫార్మాట్లపై సమానంగా దృష్టి పెట్టడం కష్టంతో కూడుకున్న పని. ఒక ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్‌కు మారేటప్పుడు మెదడు కూడా అలసిపోతుంది” అని ఉతప్ప పేర్కొన్నారు.
“కోచ్‌లలో ఎనర్జీ, కొత్త ఆలోచనలు ఉండాలంటే ఫార్మాట్‌ను బట్టి వేర్వేరు కోచ్‌లు ఉండటం మేలని నా అభిప్రాయం” అని ఆయన స్పష్టం చేశారు.
Read this also..ASME EFx India 2026 Concludes, Showcasing Emerging Engineering Talent from Across India
ఇదీ చదవండి..జూబ్లీ హిల్స్‌లో తమ 20వ క్లినిక్ ‘లేయర్స్ ప్రైవ్’ బ్రాంచ్ ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్..

అయితే, స్ప్లిట్ కోచింగ్ విధానం తెచ్చేటప్పుడు కోచ్‌ల మధ్య సరైన సమన్వయం ఉండాలని ఉతప్ప సూచించారు. ఒకరికొకరు వ్యతిరేకంగా పని చేస్తే జట్టుకే నష్టమని, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అలాగే, ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ వ్యవస్థను కూడా ఆయన సమర్థించారు.
గంభీర్ పరిస్థితి ఏమిటి? గౌతమ్ గంభీర్ హయాంలో భారత్ ఐసీసీ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పటికీ.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ ఓటమి ఆయనకు ఇబ్బందికరంగా మారింది.
గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్ నాయకత్వంలో ఆడిన ఉతప్పే ఇప్పుడు ఇలాంటి సలహా ఇవ్వడం గమనార్హం. బీసీసీఐ ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
